Take a fresh look at your lifestyle.

అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తాండూర్‌లో రూ.2.70 కోట్ల కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి

ముద్ర, తాండూరు :
పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థికంగా ఆదుకునేందుకు, వారి కుటుంబాల్లో భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు వరం లాంటివని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు నియోజకవర్గంలోని తాండూరు పట్టణంతో పాటు తాండూరు, యాలాల, బషీరాబాద్ మండలాలకు చెందిన లబ్ధిదారులకు సుమారు రూ. 2 కోట్ల 70 లక్షల విలువైన చెక్కులను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ముందుగా తాండూరు ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో తాండూరు పట్టణం, అలాగే మండలానికి చెందిన 133 మంది లబ్ధిదారులకు రూ. 1,33,15,428 విలువైన చెక్కులను అందజేశారు. అనంతరం బషీరాబాద్ మండల కేంద్రంలోని రైతు వేదికలో 73 మందికి రూ. 73,08,116, యాలాల్ ఎమ్మార్వో కార్యాలయంలో 61 మందికి రూ. 61,07,076 విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు పొందే విషయంలో లబ్ధిదారులు ఎవరికీ నయాపైసా ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎవరైనా అధికారులు కానీ, మధ్యవర్తులు కానీ డబ్బులు అడిగితే స్వయంగా నాకు ఫోన్ చేయండి. అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటా అని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ లక్ష్యం అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూర్చడమేనని, నియోజకవర్గ అభివృద్ధికి తాము నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్రెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, కౌన్సిలర్లు. నాయకులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.