Take a fresh look at your lifestyle.

కార్పొరేటర్ హమీద్ పటేల్ కలిసి సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గాంధీ

మాదాపూర్, ముద్ర: కొండాపూర్ డివిజన్ పరిధిలోని ఓయూ ప్రొఫెసర్ కాలనీలో అరవై లక్షలు రూపాయల అంచనా వ్యయంతో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులకు స్థానిక కార్పొరేటర్ హామీద్ పటేల్ తో కలిసి, పిఏసీ చైర్మన్, ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు.ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అవసరం అయిన మౌలిక వసతుల ఏర్పాటుకు అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని తెలియజేశారు. కోట్ల రూపాయలు వ్యయంతో అభివృద్ధి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. ప్రజలు కోరుకొనే విధంగా కాలనిలను అభివృద్ధి చేసే బాధ్యత మాపై ఉందని, నూటికి నూరు శాతం వారు కోరుకొనే విధంగా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కార్పొరేటర్ హమీద్ పటేల్ మాట్లాడుతూ డివిజన్ ప్రజలకు సరైన వసుతులు కల్పించడమే నా ప్రథమ కర్తవ్యమన్నారు. సీనియర్ నాయకులు కొసరాజు లక్ష్మణ్, షేక్ చాంద్ పాషా, సుద్దపల్లి విజయ్ కృష్ణ, విజయ్ శర్మ, కరీం లాలా, పెరుక రమేష్ పటేల్, మధు ముదిరాజ్, దీపక్ కచ్చావా, బోయినపల్లి గోపి కృష్ణ రావు, కొండల విద్యా సాగర్ రెడ్డి, అరుణ్, శ్రీకాంత్, అజిత్ రెడ్డి, సీహెచ్ సంతోష్, కే సంతోష్, ప్రభాకర్ రెడ్డి, శ్రీనివాస్ చౌదరి, రజనికాంత్, బుడుగు తిరుపతి రెడ్డి, రవి శంకర్ నాయక్, ఎర్ర రాజు, బసవ రాజు, కాట్రగడ్డ బసవ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.