- ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు.
మహదేవపూర్, ముద్ర: కాలేశ్వరం ప్రాజెక్టు కృంగినా ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా వరి సాగు, ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరుకున్నదని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. కాటారం, మహదేవపూర్, పలిమెల, మహాముత్తారం, మలహర్ రావు మండలాలకు సంబంధించి కాటారం మండల కేంద్రంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.గత ప్రభుత్వ హయాంలో 6.7 లక్షల టన్నుల వారి ఉత్పత్తి కాగా ప్రస్తుతం 150 లక్షల మెట్రి టాన్ లో ఉత్పత్తి జరిగిందన్నారు. గత ప్రభుత్వము హయాంలో 4.55 లక్షల ఎకరాలలో వరి సాగు చేయగా ప్రస్తుతం 15 లక్షల పైచిలుకు ఎకరాలలో వరి పండించారని తెలిపారు. గత ప్రభుత్వం రైతులకు పదివేల 415 కోట్ల రూపాయలు చెల్లించగా తమ ప్రభుత్వం 12,51 కోట్ల రూపాయలు చెల్లించడంతో పాటు రెండు వేల కోట్ల వరకు బోనసుగా రైతులకు శ్రీధర్ బాబు తెలిపారు. దొడ్డు బియ్యాన్ని పంపిణీ చేయడం, ప్రజలు తినక పోవటంతో రీసైక్లింగ్ ద్వారా ప్రభుత్వానికి పదివేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, ప్రస్తుత ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేసి పేదల కడుపు నింపడంతో పాటు ప్రభుత్వానికి వాటిల్లుతున్న నష్టాన్ని నివారించగలిగిందని పేర్కొన్నారు.నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ చేయాలని చొరవ తీసుకున్న దేశంలోనే మొదటి రాష్ట్రం మన తెలంగాణ అని తెలిపారు.డీలర్ల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని ప్రజలకు ప్రతి నిరుపేదకు వ్యక్తికి ఆరు కిలోల చొప్పున సక్రమంగా సన్న బియ్యం అందజేయాలని ఈ సందర్భంగా కోరారు.వ్యక్తికి 6 కిలోలు చొప్పున పంపిణీ చేస్తున్నామని నలుగురున్న కుటుంబానికి నెలకు దాదాపు 1400 రూపాయలు ఆదా జరుగుతున్నట్లు తెలిపారు.మంథని నియోజకవర్గంలో 41,045 మంది కార్డుదారులున్నారని ఈ పథకం అమలుతో 1,17,069 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలకు 3500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని తెలిపారు.నిలువ నీడలేని నిరుపేదలనే ఎంపిక చేయాలని, ఎలాంటి పైరవీలకు తావులేకుండ ఎంపిక జరగాలని అన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా నిరుద్యోగ యువతీ యువకులు స్వయం ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ట్రేడ్ కార్పోరేషన్ ఛైర్మన్ ఐయితా ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ప్రసంగించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, పౌర సరఫరాల అధికారి శ్రీనాద్, పౌర సరఫరాల డిఎం రాములు, మండల ప్రత్యేక అధికారి, డిఆర్డీఓ నరేష్, పరిశ్రమల శాఖ జిఎం సిద్దార్థ, కాటారం డివిజన్ మండలాల తహసీల్దార్లు, ఎంపిడివోలు తదితరులు పాల్గొన్నారు.
