మంత్రి అడ్లూరి చోరవతో విడుదలైన సబ్సిడీ నిధులు..*
సీఎంస్టీఈఐ పథకానికి నిధులు విడుదల చేసిన సర్కార్..*
*మంత్రి అడ్లూరిని సన్మానించిన CMSTEI లబ్ధిదారులు..
ముద్ర, కరీంనగర్ :
గిరిజన యువ పారిశ్రామికవేత్తలకు ఆర్థిక చేయూత అందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న CMSTEI (Chief Minister Scheduled Tribes Entrepreneurship and Innovation) పథకం కింద నిలిచిపోయిన ప్రాజెక్టులకు ఊపిరి పోసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. దాదాపు రెండున్నర సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సబ్సిడీలను విడుదల చేయడంతో లబ్ధిదారుల జీవితాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.. యువ పరిశ్రమకు వేత్తల ప్రాజెక్టులు పట్టాలు ఎక్కనున్నాయి..
వివరాల్లోకి వెళ్ళితే సీఎంస్టీఈఐ పథకం పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా 200 మంది అభ్యర్థులు ఎంపిక అయ్యారు. అందులో 18 మంది లబ్ధిదారులకు తుది ప్రొసీడింగ్స్ అందజేశారు. ప్రాజెక్టుల గ్రౌడింగ్ కు అవసరమైన సబ్సిడీ విడుదలలో ఆలస్యం కారణంగా లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేటాయించిన రూ. 50 కోట్లలో భాగంగా ఒక త్రైమాసికానికి సంబంధించిన రూ.12.30 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. రూ. 8.16 కోట్లు 18 మంది లబ్ధిదారులకు సబ్సిడీగా అందజేశారు.
ఈ పథకంలో ప్రాజెక్ట్ ఆర్థిక నిర్మాణం వ్యయంలో 35 శాతం సబ్సిడీ ప్రభుత్వం అందజేస్తుండ గా, 55 శాతం బ్యాంకు రుణం, 10 శాతం లబ్ధిదారుడి వాటాతో చెల్లించాలి. సబ్సిడీ విడుదలతో నిలిచిపోయిన ప్రాజెక్టులు ముందుకు సాగి ఎంపికైన యువతతో పాటు మరి కొంత మందికి ఉపాధి మార్గాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న నిధులు విడుదల కావడంతో లబ్ధిదారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారు, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు చొరవ తీసుకోవడంతో సమస్య పరిష్కారం అయ్యిందని లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా లబ్ధిదారులు మంగళవారం సచివాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని కలిపి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపి సన్మానించారు.
గిరిజన యువత ఉపాధికి చర్యలు.. మంత్రి అడ్లూరి..
ఈసందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. గిరిజన యువత స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగేందుకు ఇది ఒక కీలక అడుగని వారు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి గారి ఆలోచనతో రానున్న రోజుల్లో గిరిజనుల ఆర్థిక అభివృద్ధి సాధించడానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని అవసరమైన నిధులు విడుదల చేస్తుందని అన్నారు.
సర్కార్ చోరవ మరువలేము..
ఇందులో భాగంగా యువ పారిశ్రామికవేత్త తేజావత్ ప్రవీణ్ కుమార్ తన అనుభవాన్ని వెల్లడిస్తూ, “One Stop Solution to Farmers” పేరుతో వ్యవసాయ ఆధారిత వ్యాపారాన్ని స్థాపించాలనే సంకల్పంతో ముందుకొచ్చినప్పటికీ, రెండున్నర సంవత్సరాలుగా నిధులు లేక లభించక ప్రాజెక్టు నిలిచిపోయిందన్నారు. తాజాగా ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేయడంతో తమ ప్రాజెక్టుకు ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు.
గిరిజన శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి సమస్యను తీసుకువెళ్ళిన వెంటనే స్పందించి, ముఖ్యమంత్రి గారితో పాటు ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధించడంలో కీలక పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు. సహకారం తమలాంటి యువ పారిశ్రామికవేత్తలకు ప్రేరణగా నిలుస్తుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో TRICOR చైర్మన్ బెల్లయ్య నాయక్, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ సంతోష్,GM శంకర్ రావు , స్టేట్ మిషన్ మేనేజర్ లక్ష్మీ ప్రసాద్, DGM రవి కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.