పండిట్ జవహర్ లాల్ నెహ్రు విగ్రహ పునః ప్రతిష్ఠకి బల్దియాలో బడ్జెట్ కేటాయిస్తారని ఆశించాం. – జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మల్యాల సుజిత్ కుమార్
ముద్ర , కరీంనగర్ :
స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా కరీంనగర్ నగరం సవరన్ స్ట్రీట్ నెహ్రూ చౌక్ వద్ద మునిసిపల్ అధికారులు అయిదు సంవత్సరాలక్రితం తొలగించిన మాజీ ప్రధాని శ్రీ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించాల్సిన బాధ్యత బల్దియాదే అని గుర్తు చేశారు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మల్యాల సుజిత్ కుమార్. ఈ అంశంపై కమీషనర్ కు, కలెక్టర్ కు పలుమార్లు విన్నవించుకున్నా, బల్దియాముందు గత మేయర్ పై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు చేసినా ఫలితం లేకుండా పోయిందని అన్నారు సుజిత్ కుమార్.