Take a fresh look at your lifestyle.

హెచ్ సీయూ చుట్టూ కంచె వేయాలి

  • అప్పట్లో యూనివర్సిటీకి 2434 ఎకరాలిచ్చింది కాంగ్రెస్సే.
  • ఇప్పటికే పలు ప్రభుత్వ నిర్మామాలతో హెచ్ సీయూ భూమి కోల్పోయింది.
  • కొంతభూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళింది.
  • ఇప్పుడున్న భూమి ఎంత? ఎవరెవరికి ఎంత ఇచ్చారో చర్చింద్దాం.
  • లీగల్ డాక్యుమెంట్స్ ను కూడా పరిశీలించాం.
  • హెచ్ సీయూ వీసీలతో బీజేపీ ఎంపీలు భేటీ.

ముద్ర, తెలంగాణ బ్యూరో : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల చుట్టూ కంచె వేయాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు.ఈ మేరకు బుధవారం హెచ్ సీయూ భూముల విషయంలో చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నివాసంలో బీజేపీ ఎంపీలు రఘునందర్ రెడ్డి, ఈటల రాజేందర్, హెచ్ సీయీ వీసీ జగదీశ్వర్ రావు సమావేశమయ్యారు. అప్పట్లో యూనివర్సిటీకి 2434 ఎకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చిందని, ఇప్పటికే పలు ప్రభుత్వ నిర్మాణాలతో హెచ్ సీయూ భూమిని కోల్పోయిందని వీసీ దృష్టికి బీజేపీ ఎంపీలు తీసుకెళ్ళారు.కొంత భూమి ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోయిందని, ఇప్పడున్న భూమి ఎంతా?, ఎవరెవరికి ఎంత ఇచ్చారో చర్చించి, లీగల్ డాక్యూమెంట్స్ కూడా పరిశీలించినట్లు బీజేపీ ఎంపీలు తెలిపారు.అనంతరం బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 2434 ఎకరాల భూమిని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమేఇచ్చిందని, పలు కారణాల వల్ల ఇందులో చాలా భూమి పోయిందని అన్నారు. ప్రభుత్వం కొంత భూమిని తిరిగి తీసుకోవడం, గచ్చిబౌలి స్టేడియంకు కొంత కేటాయించడం, ఎమ్మార్వో ఆఫీస్, నవోదయ స్కూల్, మున్సిపల్ ఆఫీస్‌కు కేటాయించడం, కొంత భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి పోవడం లాంటివి జరిగాయని తెలిపారు. అయితే, ఇప్పటికీ ఎన్ని ఎకరాలు ఉన్నాయని, భూములు ఎవరెవరికి ఇచ్చారని, సర్వే చేసే అవకాశం ఉందా అనే అంశాలపై చర్చ జరిపామని అన్నారు. లీగల్ డాక్యుమెంట్స్ ను కూడా పరిశీలించామని చెప్పారు. పొలిటికల్ స్టేట్ మెంట్స్ ఇవ్వడానికి చర్చ జరపలేదని, అసలు భూమి ఎవరిది..? చెట్లు కొట్టొచ్చా..?అనే దానిపై వీసీ, రిజిస్ట్రార్ తో చర్చించేందుకే మీటింగ్ పెట్టుకున్నామని కొండా విశ్వేశ్వర రెడ్డి చెప్పారు. అనంతరం ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ..హెచ్ సీయూ భూములను తానే కాపాడునట్లుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుద్ధపూసలా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.సెంట్రల్ యూనివర్సిటీతో నాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 534 ఎకరాలు తీసుకుంటూ అగ్రి మెంట్ చేసుకుందని దాంట్లో 397 ఎకరాలు మాత్రమే తిరిగి యూనివర్సిటీకి బదలాయిం చిందని అన్నారు. మిగతా 137 ఎకరాలు రిజి స్ట్రేషన్ చేయలేదన్నారు.అయితే యూనివర్సిటీ కి ఇవ్వాల్సిన 134 ఎకరాలను కేసీఆర్ టీఎన్జీవోలకు ఇచ్చారని అన్నారు.నిజంగా బీఆర్ఎస్ కు విద్యార్థులపై, యూనివర్సిటీపై ప్రేమ ఉంటే ఆరోజే ఆ 134 ఎకరాలను వర్సిటీకి ఇచ్చేదని అన్నారు.అప్పుడు ఆ భూమిని ఇవ్వకుండా ఆ తప్పును ఇతరుల మీదకు నెట్టే ప్రయత్నాలను బీఆర్ఎస్ చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. టీఎన్జీవోల కోసం భూమి ఇచ్చి ఇక్కడ రోడ్డు వేస్తే దానిపై యూనివర్సిటీ కోర్టుకు వెళ్తే కేసు ఓడిపోయారని చెప్పారు.ఈ కేసు సుప్రీంకోర్టులో నడుస్తోందనిచెప్పారు.హెచ్ సీయూకు 2,185 ఎకరాల భూమి మాత్రమే ఉందన్నారు.మొన్నటి వరకు వివాదంలో ఉన్న 400 ఎకరాలు కూడా ప్రైవేటు వ్యక్తులది కాదని కోర్టు తేల్చిందని, అలాంట ప్పుడు ఆ భూమి హెచ్ సీయూదే అవుతుందని అన్నారు. మొత్తం భూమికి ఫెన్సిగ్ వేసి హెచ్సీ యూకు సీఎం అప్పగించాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.