Take a fresh look at your lifestyle.

భాగ్యరెడ్డి వర్మ ఆశయాలు యువతకు ఆదర్శం : జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

 

ముద్ర ప్రతినిధి సంగారెడ్డి, :

సామాజిక సమానత్వం, విద్యా విస్తరణ, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ అని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు.

భాగ్యరెడ్డి వర్మ జయంతి సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జయంతి వేడుకల్లో పాల్గొన్న కలెక్టర్, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో వెనుకబడిన వర్గాలకు విద్య, ఆత్మగౌరవం, సమాన హక్కుల కోసం భాగ్యరెడ్డి వర్మ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. యువత మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని, సమానత్వ భావనతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పాండు
జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి,జిల్లా అధికారులు,ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.