Take a fresh look at your lifestyle.

రాత్రి వేళల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి చెక్‌పోస్టును తనిఖీ చేసిన ఎస్పీ శ్రీనివాస రావు

ముద్ర ప్రతినిధి, మెదక్:
పశువుల అక్రమ రవాణాపై ఎలాంటి రాజీ ఉండదని కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు హెచ్చరించారు. పెద్ద శంకరంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోలపల్లి చెక్‌పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక తనిఖీ కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీ విధానం, రికార్డుల నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సంబంధిత అనుమతి పత్రాలు, రవాణా ధృవపత్రాలు తప్పనిసరిగా పరిశీలించాలని ఆదేశించారు. తనిఖీ చేసిన ప్రతి వాహనం వివరాలను రిజిస్టర్లలో నమోదు చేసి పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
*రేగోడ్ పోలీస్ స్టేషన్‌ తనిఖీ
రేగోడ్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని వివిధ రికార్డులు, కేసు ఫైళ్లు, పెండింగ్ కేసుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని, దర్యాప్తు ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులకు ఆదేశించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందేలా సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. మెదక్ డీఎస్పీ ప్రసన్న కుమార్, సీఐలు రాజశేఖర్ రెడ్డి, రేణుక, సందీప్ రెడ్డి, ఏఎస్సై శంకర్, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.