Take a fresh look at your lifestyle.

శ్రీశైలం ప్రాజెక్టు వరద ముప్పు

  • భారీ వరదతో దెబ్బతిన్న ప్లంజ్ పూల్ కాంక్రీట్ స్టీల్ సిలిండర్ డ్రమ్స్‌
  • జలాశయాన్ని సందర్శించిన సీడీవో బృందం

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులకు వరద ముప్పు వెంటాడుతోంది. ఇప్పటికే కాళేశ్వరం, సుంకిశాల ప్రాజెక్టు నిర్మాణాల్లో లోపాలు బట్టబయలు కాగా తాజాగా శ్రీశైలం డ్యాం ఆ జాబితాలో వచ్చి చేరింది. కృష్ణానదిపై ఉన్న అతి పెద్దదైన శ్రీశైలం జలాశయం డ్యామ్ కొద్ది కాలంగా ఊగుతున్నది. ముఖ్యంగా డ్యామ్ దిగువన ఉన్న ప్లంజ్ పూల్ కాంక్రీట్ స్టీల్ సిలిండర్ డ్రమ్స్‌ భారీ వరద కారణంగా దెబ్బ తిన్నాయి. దాంతో భారీ గుంత ఏర్పడి డ్యామ్ సేఫ్టీ పై కొద్ది రోజులుగా ఆందోళనలు మొదలయ్యాయి.ఈ సమాచారం అందుకున్న సివిల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (సీడీవో) బృందం సోమవారం శ్రీశైలం చేరుకుంది.ఆ ప్రాజెక్టులో తలెత్తిన లోపాలపై అప్రమత్తమైన ఆ బృందం సభ్యులు డ్యామ్ దిగువన దెబ్బతిన్న ప్లంజ్ పూల్ కాంక్రీట్ స్టీల్ సిలిండర్ డ్రమ్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేశారు.డ్యామ్ దిగువన ఏర్పడిన ప్లంజ్ పూల్ గుంతను సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సీఈ విజయభాస్కర్ ఆధ్వర్యంలో పరిశీలించారు.అలాగే డ్యామ్ ప్రస్తుత నీటి నిల్వల వివరాలు, పలు అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.డ్యాం సేఫ్టీపై సంబంధిత అధికారులకు కీలక సూచనలు ఇచ్చారు.కాగా వర్షకాలంలో ఈ డ్యాం పూర్తిగా నిండితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.అలాగే తాగు నీటితో పాటు, రెండు రాష్ట్రాల అవసరాలకు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ నేపథ్యంలో వర్షాకాలం మొదలయ్యేలోపే ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. అవసరమైతే మరమ్మత్తు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించింది.

Leave A Reply

Your email address will not be published.