Take a fresh look at your lifestyle.

రెవెన్యూ,అటవీ భూముల సరిహద్దు సమస్యలు పరిష్కరించాలి అధికారులతో కలెక్టర్ ప్రతిమా సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్:
రెవెన్యూ,అటవీ భూముల సరిహద్దు సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులకు సూచించారు.


సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ నగేష్, అటవీ, సివిల్ సప్లై, హౌసింగ్, రెవెన్యూ, మిషన్ భగీరథ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. రెవెన్యూ,అటవీ భూముల సరిహద్దు సమస్యలను పరిష్కరించాలన్నారు. ధాన్యం కోనుగోలు లో లోడింగ్, ఆన్ లోడింగ్ పక్రియ త్వరగా పూర్తి చేయాలని, వేసవిలో త్రాగు నీటి సమస్య రాకుండా చూడాలన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పురోగతిని తెలుసుకున్నారు. త్వరగా నిర్మాణాలు పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేపట్టాలని ఆదేశించారు. సాదా బైనామాలు పరిశీలించాలని, జనగణన ప్రక్రియలో ప్రజలను భాగస్వామ్యం, స్వీయ గణనలో అధికారులు భాగస్వామ్యం కావాలన్నారు.
సంక్షేమ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ సేవలు విస్తరించాలని, సభ్యత్వం పెంచాలని సూచించారు.
ఈ అటవీశాఖ అధికారి జోజీ, ఆర్డీవోలు తసిల్దార్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.