Take a fresh look at your lifestyle.

మెదక్ మున్సిపాలిటీ ఎంపిక, రూ.8 కోట్లు మంజూరు

ముద్ర ప్రతినిధి, మెదక్:
అర్బన్ చాలెంజ్ ఫండ్ క్రింద తెలంగాణలో కొన్ని మున్సిపాలిటీలను ఎంపిక చేశారు. అందులో మెదక్ మున్సిపాలిటీ ఎంపికైందని మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక భూపతిరాజ్ తెలిపారు. ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు కృషి వలన మెదక్ లోని పిల్లి కొట్టాల వద్ద అసంపూర్తిగా ఆగిపోయిన మున్సిపల్ వెంచర్ అభివృద్ధికి 8 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఈ సందర్బంగా మున్సిపాలిటీ అత్యవసర సమావేశం నిర్వహించారు. వైస్ చైర్మన్ నరేష్ గౌడ్, కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.