Take a fresh look at your lifestyle.

జగిత్యాల ధ్యానం నిల్వలు కోసం సిరిసిల్ల గోదాములు కేటాయించండి..

 

ధాన్యం కొనుగోలు పై వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి అడ్లూరి..

ముద్ర, హైదరాబాద్:

జగిత్యాల జిల్లాలో రబీ సీజన్లలో రైతులు పండించిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆఫరల్ పార్కులో ఉన్న గోదాములను కేటాయించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి గారిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. సోమవారం హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆకాల వర్షాలు, ధాన్యం కొనుగోలు పై పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

వీడియో కాన్ఫరెన్స్ కు హాజరైన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో గత ఖరీఫ్ సీజన్ లో రైతుల వద్ద రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యం సుమారుగా మూడున్నర లక్షల మెట్రిక్ టన్నులు జగిత్యాల జిల్లాలోని రైస్ మిల్లులో నిలిచిపోయిందని తెలిపారు. ఈ రబీ సీజన్ లో జిల్లాలో మూడు లక్షల ఎకరాల వరి సాగు చేశారని సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం దిగుబడులు వస్తాయని అంచనా ఉందని మంత్రి వివరించారు.

ప్రస్తుతం కొనుగోలు ప్రారంభమైన నేపథ్యంలో ధాన్యం నిలువ చేయడానికి రైస్ మిల్లులో స్థలం లేక తూకం వేసిన ధాన్యం లారీలు మిల్లుల వద్ద వేచి ఉంటున్నాయని మంత్రి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అఫరాల్ పార్కులో ఉన్న గోదాముల్లో జగిత్యాల జిల్లా ధాన్యం నిల్వ చేసే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేశారు.

Leave A Reply

Your email address will not be published.