ముద్ర కూకట్‌పల్లి :
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం కార్యకర్తలు, నాయకులు ఘనంగా నిర్వహించారు. కెపిహెచ్‌బి కాలనీ 5వ ఫేస్‌లోని రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ ప్రధాన కార్యక్రమానికి పార్టీ
ఈ వేడుకల్లో జనసేన పార్టీ జనరల్ సెక్రెటరీ తాళ్లూరి రాము, ప్రచార కమిటీ కార్యదర్శి ఆర్కే సాగర్, రాష్ట్ర నాయకులు రాధారం రాజలింగం, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కోఆర్డినేటర్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నాయకులు, వీర మహిళల సమక్షంలో పార్టీ జెండాను ఆవిష్కరించి, మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో 2014లో పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా పార్టీ
ఆవిర్భవించిందని గుర్తు చేశారు.
పవన్ కళ్యాణ్ అవలంబిస్తున్న విధానాల పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు ఆకర్షితులవుతున్నారు.
నిజాయితీ, జవాబుదారీతనం కలిగిన రాజకీయాలే జనసేన లక్ష్యం.రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రభుత్వ స్థాపన దిశగా బలమైన అడుగులు వేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్ మరియు వివిధ జిల్లాల నుంచి వచ్చిన జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Prev Post