Take a fresh look at your lifestyle.

నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన తాపీ మేస్త్రి వల్లెపు శ్రీనివాస్…

 

తన సొంత ఖర్చులతో పేదింటి బిడ్డకు కళ్యాణం చేసిన తాపీ మేస్త్రి శ్రీను……

ముద్ర నడిగూడెం…..

పేదింటి బిడ్డకు పెళ్లి చేసిన ఘనత తాపీ మేస్త్రీకి దక్కింది.
సూర్యాపేట జిల్లా, హుజూర్నగర్ మండలం, వేపల సింగారం గ్రామానికి చెందిన వేముల వీరబాబు – సునీత దంపతులు బ్రతుకుతెరువు కోసం నడిగూడెం వచ్చి జీవనం సాగిస్తున్నారు. కుటుంబ పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉండటంతో పాటు వారికి ముగ్గురు కుమార్తెలు ఉండటంతో కుటుంబ పోషణ కూడా చాలా కష్టంగా మారింది.
ఈ పరిస్థితుల్లో పెద్ద కుమార్తె నాగలక్ష్మి వివాహం చేయడం వారికి భారంగా మారింది.. దిక్కు తోచని స్థితిలో ఉన్న కుటుంబానికి తానే దేవుడు అయ్యి పెద్ద దిక్కులా మారాడు. మానవత్వం చాటుకున్న ఈ మనసున్న మహారాజును చూసి దంపతులు వివాహ ఖర్చును తానే భరిస్తానని చెప్పటం ఎంతో సంతోషదాయకమని తెలిపారు.
చెప్పినట్లే ఆయన మాట నిలబెట్టుకుని గురువారం నాగలక్ష్మి వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వివాహానికి సుమారు 70,000 ఖర్చు చేసి తన ఉదారతను చాటుకున్నారు.నిరుపేద కుటుంబానికి అండగా నిలిచిన వల్లెపు శ్రీనివాస్ సేవా భావాన్ని సిఐటియు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ, మరియు గ్రామ ప్రజలు స్థానికులు ప్రశంసిస్తున్నారు. తన కుమార్తెకు వివాహం జరిపించిన వల్లెప్ శ్రీనుకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.