భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కరీంనగర్ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ను నియమించిన సంధర్బంగా కరీంనగర్ లో గురువారం రోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో సునీల్ రావుకు పలువురు నాయకులు అభినందనలు తెలిపారు. బీజేపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ శాంతకుమార్ గారు, బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు మనోహార్ రెడ్డిగారు, పార్లమెంటు నియోజకవర్గ ఇంచార్జ్ బోయినపల్లి ప్రవీణ్ రావు గారు శాలువాలతో సన్మానించి… శుభాకాంక్షలు తెలిపారు.