- 18, 19, 20 తేదీల్లో అన్ని జిల్లా కేంద్రాల్లోనూ.
- 21, 22, 23 తేదీల్లో మున్సిపాలిటీలు, అసెంబ్లీ నియోజవర్గాల్లో.
- బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వేంకటేశ్వర్లు.
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన సందర్భంగా భారత జవాన్ల వీరోచిత పోరాటానికి సెల్యూట్ చేస్తూ ఈనెల 17న హైదరాబాద్ ట్యాంక్‌బండ్ వద్ద తిరంగా యాత్ర నిర్వహిస్తామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వేంకటేశ్వర్లు చెప్పారు.ఈనెల 18, 19, 20 తేదీల్లో అన్ని జిల్లా కేంద్రాల్లోనూ, అలాగే ఈనెల 21, 22, 23 తేదీల్లో మున్సిపాలిటీలు, అసెంబ్లీ నియోజవర్గాల్లోనూ తిరంగా యాత్రలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.ఈ మేరకు నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తిరంగా యాత్ర కార్యక్రమ ఏర్పాట్లకు సంబంధించి కాసం వేంకటేశ్వర్లు నేతృత్వంలో రాష్ట్ర కార్యదర్శులు ఎస్. ప్రకాష్ రెడ్డి, కొల్లి మాధవి, రాష్ట్ర అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్, పార్టీ నేత ఎన్. గౌతమ్ రావు సమావేశమైన చర్చించారు.అనంతరం మీడియాతో కాసం వేంకటేశ్వర్ల మాట్లాడుతూ..ఉగ్రవాదులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని, సామాన్య పౌరులకు హాని కలగకుండా ఆపరేషన్ సిందూర్ ను విజయవంతంగా నిర్వహించడం గొప్ప విషయమని అన్నారు.ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిన సందర్భంగా వీర జవాన్లకు వందనాలు తెలుపుతూ, భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన అన్ని రక్షణ వ్యవస్థలను అభినందిస్తూ దేశ వ్యాప్తంగా తిరంగా యాత్రలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించడం జరిగిందన్నారు. తెలంగాణలో సిటిజన్స్ ఫోరం ఫర్ నేషనల్ సెక్యూరిటీ సంస్థతో కలిసి తిరంగా యాత్రలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.సిటిజన్స్ ఫోరం ఫర్ నేషనల్ సెక్యూరిటీ ద్వారా నిర్వహించే కార్యక్రమాలకు బీజేపీ పూర్తిస్థాయి మద్దతు తెలుపుతుందన్నారు.తెలంగాణ ప్రజలందరూ తిరంగా యాత్రలో పాల్గొని భారత సైనికులకు వందనాలు తెలియజేయాలని కాసం వేంకటేశర్లు కోరారు.నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత దేశం విశ్వగురు స్థాయికి ఎదిగిందన్నారు.ప్రపంచానికి ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే ధైర్యం భారతదేశానికి ఉందని సాక్ష్యంగా చూపించారన్నారు.పాకిస్థాన్ తుప్పు పట్టిన చైనా ఆయుధాలు, పనికిరాని టర్కీ డ్రోన్లతో అల్లకల్లోలం సృష్టించాలనుకుందని విమర్శించారు.అయితే భారత సైన్యం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన రక్షణ వ్యవస్థలతో అద్భుతమైన విజయం సాధించిందని కొనియాడారు