Take a fresh look at your lifestyle.

తప్పు ఇంజనీర్లదే

  • కేసీఆర్ తానా అంటే తందానా అని ఇంజినీర్లు అన్నారు.
  • ఈ ఎపిసోడ్‌లో కేసీఆర్‌ను ఈటల ప్రొటెక్టు చేశారన్న వాదన తప్పు.
  • చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.

ముద్ర, తెలంగాణ బ్యూరో : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ లోపాలకు తప్పు అంతా ఇంజినీర్లదేనని, కేసీఆర్ తాన అంటే తందాన అన్నారని చేవెళ్ల ఎంపీ, బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు శనివారం మీడియాతో ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడారు.. కాంగ్రెస్ హయాంలో నిర్మించ తలపెట్టిన ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టు ఒక అసాధ్యమైందని, దాంతో చేవెళ్ల ప్రాంతానికి చుక్క నీరు కూడా రావని అన్నారు. కాంగ్రెస్ నాయకులు కేవలం మాయమాటలు చెప్పారని అన్నారు. దానిని కేసీఆర్ రద్దు చేస్తారని భావిస్తే ఆయన అంబేద్కర్ పేరు తొలగించి కాళేశ్వరం పేరు పెట్టారని చెప్పారు. ఈ రెండింటిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన డిజైన్ బాగుందని, కేసీఆర్ డిజైన్ బాగాలేదని అన్నారు. కాళేశ్వరం డిజైనింగ్ చర్చలో హరీశ్ రావు, ఈటల లేరని తెలిపారు. ఈ టోటల్ ఎపిసోడ్ లో ఎంపీ ఈటల రాజేందర్‌ది చిన్న పాత్ర మాత్రమేనని చెప్పారు. ఇంత పెద్ద అవినీతి జరిగినా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదో సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈటల విచారణలో ఏం చెప్పారో తనకు తెలియదని, అయితే ఇందులో ఆయన పాత్ర జీరో అని అన్నారు. కేసీఆర్ ను ఎంపీ ఈటల ప్రొటెక్ట్ చేశారనడం వంద శాతం తప్పని అన్నారు. తాను ఈటలకు సపోర్ట్ చేసేందుకు మీడియా ముందుకు రాలేదని, నిజాలు చెప్పేందుకు వచ్చానని అన్నారు. గులాబీ జెండా అందరిదీ అన్న ఈటలను తన్ని వెళ్లగొట్టారని, అలాంటి కేసీఆర్ ను ఈటల ఎందుకు ప్రొటెక్ట్ చేస్తారని విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.

Leave A Reply

Your email address will not be published.