-అధికారుల తప్పిదమే ఓటర్లకు ఇబ్బందులు
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని 9వి వార్డులోని 20, 21వ వార్డులను తారుమారు చేసి ఓటర్లను ఇబ్బందులకు గురి చేస్తున్న అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలనీ కాంగ్రెస్ నాయకులు, మాజీ జడ్పిటీసీ ముత్తహార్ షరీప్ డిమాండ్ చేశారు. పోలింగ్ అధికారుల నిర్లక్ష్యం
ఓటర్లకు ఇబ్బందులు ఏర్పడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కలెక్టర్ తో మాట్లాడిన కూడా
ఈ సమస్య పరిష్కారం కాలేదన్నారు.