Take a fresh look at your lifestyle.

సమ్మర్ క్యాంప్ ప్రారంభించిన చైర్మన్ శ్రీవాణి రవికుమార్

 

 

 ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : 

భువనగిరిలోని పీఎం శ్రీ ప్రభుత్వ హైస్కూల్ (గంజ్)లో సోమవారం సమ్మర్ క్యాంప్‌ను భువనగిరి పట్టణ మున్సిపల్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ ప్రారంభించారు.

“లెర్న్ టుడే , లీడ్ టుమారో ” నినాదంతో 6 నుండి 10వ తరగతి విద్యార్థుల కోసం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ “వేసవి సెలవులను విద్యార్థులు వృథా చేసుకోకుండా సమ్మర్ క్యాంప్‌లో కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలన్నారు. చదువుతో పాటు ఆటలు, పాటలు, కళలపై ఆసక్తి పెంచుకోవాలని ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి దోహదపడతాయన్నారు. మున్సిపల్ తరఫున పాఠశాలకు పూర్తి సహకారం అందిస్తాం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ తంగళ్లపల్లి రవికుమార్, స్థానిక కౌన్సిలర్ సరిగడ రాజ్యలక్ష్మి అమర్, ప్రిన్సిపల్ ధనుంజయ్, విద్యా కమిటీ చైర్మన్ స్వప్న రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, స్థానిక నాయకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.