ముద్ర ప్రతినిధి,అమరావతి:
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్యా సంస్థలు, ప్రభుత్వం, పారిశ్రామిక రంగం సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సీఐఐఐ బిజినెస్ సమ్మిట్‌లో ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమలకు అవసరమైన నిపుణులైన మానవ వనరులను విద్యా సంస్థలు సిద్ధం చేశాయి, ప్రభుత్వాలు పెట్టుబడులు తీసుకురావాలని అన్నారు. ఈ మూడు రంగాలు కలిసే పనిచేస్తేనే దేశం ఆశించిన ఫలితాలు సాధించగలదన్నారు.
గ్లోబల్ టెక్ రంగంలో భారత్ అగ్రస్థానానికి చేరాలంటే పరిశోధన, స్కిల్లింగ్, స్టార్టప్‌లు, మాన్యుఫాక్చరింగ్, గవర్నెన్స్, ఇన్నోవేషన్ వంటి సమీకృత విధానాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. పట్టభద్రులను ఉద్యోగాలకు సిద్ధం చేయడానికి నెలల తరబడి సమయం వృథా చేస్తే లక్ష్యాలను చేరుకోలేమని, ఎంప్లాయబిలిటీని జాతీయ మిషన్‌గా గుర్తించారు.
2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం చెప్పారు. గత 22 నెలల్లో రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు, 24 లక్షల ఉద్యోగాలను తీసుకురాగలిగామని. గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల ఉత్పత్తిని ఏపీలోనే సాధించే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని చెప్పారు.
విశాఖపట్నంలో అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడితో డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేశామని, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి సంస్థల డేటా సెంటర్ రంగంలో పెట్టుబడులకు ముందుకొచ్చాయని తెలిపారు. అలాగే రిన్యూ పవర్ ఇంగాట్ సోలార్ వేఫర్ తయారీకి ముందుకు వచ్చింది.
రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని ఇప్పటికే 30 పైసలు తగ్గించామని, త్వరలోనే రూ.1.30 వరకు తగ్గించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానాలతో ప్రభుత్వం పనిచేస్తుంది.
టెక్నాలజీ ఆధారిత నగరంగా అమరావతిని అభివృద్ధి చేస్తున్నామని, నెట్ జీరో కాన్సెప్ట్‌తో రాజధాని నిర్మాణం కొనసాగుతోందని సీఎం పేర్కొన్నారు. అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలన్నారు.