- ఖమ్మం అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి.
ముద్ర, ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో: దాన్యం కొనుగోలులో నాణ్యతా ప్రమాణాలను తూచా తప్పకుండా పాటించాలని ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.మంగళవారం ఆయన తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, వేంసూరు మండలాల్లో పర్యటించారు. తులుత ఆయన తల్లాడ మండలంలోని మిట్టపల్లి గ్రామంలో నూతన రేషన్ కార్డు దరఖాస్తుదారుల విచారణ ప్రక్రియను పరిశీలించారు.పెనుబల్లి మండలంలోని మందల పాడు గ్రామంలో సూర్య తేజ రైస్ మిల్లును తనిఖీ చేశారు.వేంసూరు, పెనుబల్లి మండల తహసిల్దార్ కార్యాలయాలు సందర్శించిన ప్రభుత్వ భూమి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం తేమ శాతం రాగానే కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాల వద్ద అవసరమైన గన్ని బ్యాగులు, టార్ఫాలిన్ సంచులు, ప్యాడీ క్లీనర్లు, తేమ, వెయింగ్ యంత్రాలు అందుబాటులో వుంచుకోవాలన్నారు.ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటలలో రైస్ మిల్లులకు తరలించాలని, అందుకు అవసరమైన వాహనాలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేసవి దృష్ట్యా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు మౌళిక సదుపాయాలు కల్పించాలన్నారు. చల్లని త్రాగు నీరు, ఓఆర్ఎస్ ప్యాకేట్లు, నీడ ఉండేలా చూడాలని సూచించారు. ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి చందన్ కుమార్, కల్లూరు ఆర్డీఓ ఎల్. రాజేందర్ తదితరులు ఉన్నారు.