Take a fresh look at your lifestyle.

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే.. రాజీవ్ యువ వికాసం పథకం లక్ష్యం

  • రేషన్ కార్డు లేదా ఆహార భద్రత కార్డుతో దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియను వేగవంతం చేయండి.
  • టెలికాన్పరెన్స్లో మండల, మున్సిపల్ అధికారులకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశం.

ఉమ్మడి రంగారెడ్డి, ముద్ర ప్రతినిధి: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన రాజీవ్ యువ వికాసం పథకం ను నూతనంగా ఫ్రారంభంచడం జరిగందని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సీ నారాయణరెడ్డి తెలిపారు.ఈ పథకం క్రింద స్వయం ఉపాధి యూనిట్ల మంజూరుకు సంబంధించి అన్ని కార్పొరేషన్ లకు సంబంధంచిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిందన్నారు.మంగళవారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి రాజీవ్ యువ వికాసం పథకం సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ..రాజీవ్‌ యువ వికాసం పథకం కింద దరఖాస్తు చేసేందుకు రేషన్‌ కార్డు లేదా ఆహార భద్రత కార్డు ఉంటే సరిపోతుందని, ఆదాయ ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. దరఖాస్తు గడువును ఈ నెల 14వ తేదీ వరకు పొడగించడం జరిగిందని, అన్ని మున్సిపాలిటీ, ఎంపిడిఓ కార్యాలయములలో ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలనీ కలెక్టర్ తెలిపారు. మండల, మున్సిపల్‌ కార్యాలయాల్లోని ప్రజాపాలన కేంద్రాల్లో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. డిఆర్డీఏ పీడీ, ఎస్సి కార్పోరేషన్ ఈడీ, ఇతర అధికారులు నోడల్ అధికారులుగా ఉన్నారని, బ్యాంక్ మేనేజర్లు ఈ కార్యక్రమం పై ఒరియంటేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయాలని ఆన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని, ఎల్.ఆర్.ఎస్. ప్రక్రియను కూడా వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

Leave A Reply

Your email address will not be published.