Take a fresh look at your lifestyle.

సమాజంలో శాంతి స్థాపనకు ఎంపీజే కృషి

 

* సమాజం పట్ల యువత బాధ్యత పై అవగాహన కల్పించడం లక్ష్యం
రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ మజీద్ షోయబ్

ముద్ర ప్రతినిధి,సిద్దిపేట:

సామాజిక బాధ్యత పట్ల యువతకు అవగాహన, చైతన్యం తేవడమే ఎంపీజే ( మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ )లక్ష్యం అని రాష్ట్ర సంస్థ అధ్యక్షులు అబ్దుల్ మజీద్ షోయబ్ తెలిపారు. బుధవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో అయన మాట్లాడుతూ తెలంగాణ సాధనలో ఎంపీజే కూడా భాగస్వామ్యం అయ్యిందని తెలిపారు. సమాజంలో ఉన్న సమస్యల పరిష్కారానికి ఎంపీజే ఎప్ప్పుడు ముందుటుందని తెలిపారు. అలాగే ఎన్నో రోజుల నుండి ఎవరి సహాకారం లేకుండా జైల్లోనే మగ్గుతు ఉన్న నిరుపేద ఖైదీలను కూడా విడిపించడం ఎంపీజే బాధ్యత తీసుకుందాన్నారు. ప్రస్తుతం కుల మతాలకు అతీతంగా SIR కార్యక్రమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా హెల్ప్ డెస్క్ ఏర్పాట్లు చేశామన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్న ఎంపీజే తన వంతు సహాయంగా పరిష్కహరానికి చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ సందర్బంగా సిద్దిపేట జిల్లా ఎంపీజే నూతన కమిటీ ని ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షుడిగా మొహమ్మద్ అమీర్, ప్రధాన కార్యదర్శిగా,అలా ఉర్ రహేమాన్,ఉపాధ్యక్షులుగా గౌస్ పాషా,మొహమ్మద్ బషీర్, జాయిన్ సెక్రటరిలుగా ఆరిఫ్ ముజఫ్ఫార్, సయ్యాద్ జహీర్, కలీం రిజ్వి, ట్రే, ట్రేజరర్ మొహమ్మద్ ఫరూక్ అలీ, పి ఆర్ ఓ గా సాజిద్ పాషా, సభ్యులుగా అబ్దుల్ ఖాదర్, మెహమ్మద్ అన్వర్, అక్బర్ నవాబ్, మొహమ్మద్ అయ్యుబ్, ఉస్మాన్, షార్ఫుద్దిన్ తదితరులు నియమించినట్టు తెలిపారు. నూతన కమిటీ సమాజంలో శాంతి స్థాపనకు కృషి చేయాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.