Take a fresh look at your lifestyle.

ప్రధాని పర్యటన భద్రతపై ఉన్నతస్థాయి సమీక్ష”

 

ముద్ర, శేరిలింగంపల్లి :

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఈ నెల మే 10న హైదరాబాద్‌కు రానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు పై సీఎస్ రామకృష్ణారావు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ పర్యటన సందర్భంగా హైదరాబాద్ లోని ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణలు, ఆంక్షలు అమలు చేయడంతో పాటు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

పోలీస్, ట్రాఫిక్, ఇంటెలిజెన్స్, జీహెచ్‌ఎంసీ తో పాటు వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎస్ సూచించారు. ప్రధాని భద్రతకు సంబంధించిన ‘బ్లూ బుక్’ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని, పర్యటన వివరాలను గోప్యంగా ఉంచాలని అధికారులకు స్పష్టం చేశారు.
హెచ్‌ఐసీసీలో జరగనున్న సమావేశ హాలును అధికారులు సందర్శించారు.
ఈ సమీక్ష సమావేశంలో డీజీపీ లా అండ్ ఆర్డర్ మహేష్ భగవత్, సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం. రమేష్, రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.