Take a fresh look at your lifestyle.

తెలంగాణ వ్యాప్తంగా ఐదు లక్షల అరవై ఒక్క వేల మందికి కొత్త రేషన్ కార్డుల మంజూరు

  • తుంగతుర్తి నియోజకవర్గ గడ్డం నుండి గతంలో సన్నబియ్యం నేడు కొత్త రేషన్ కార్డుల పంపిణీ.
  • మూడు కోట్ల పది లక్షల మందికి తెలంగాణ వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ.
  • 26 లక్షల మంది రేషన్ కార్డుదారులకు పేర్ల మార్పిడికి అవకాశం.
  • వ్యవసాయం దండగ కాదు పండుగని నిరూపించిన కాంగ్రెస్ పార్టీ.
  • కాలేశ్వరం లేకుండానే రికార్డు స్థాయిలో తెలంగాణలో వరి ధాన్యం ఉత్పత్తి.
  • తుంగతుర్తి నియోజకవర్గానికి దేవాదుల ద్వారా గోదావరి జిల్లాలు అందిస్తాం.
  • పది సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచుకు తిన్న గత పాలకులు.
  • కాలేశ్వరం కాదు వారు నిర్మించింది కూలేశ్వరం.
  • గోదావరి జల్లాలు తేవడం అంటే గ్లాసులో సోడా పోసినట్టు కాదు.
  • మూడు అడుగుల ఆయన తుంగతుర్తి గోదావరి జిల్లాలు తెస్తాడా?
  • కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులపై గత పాలకులు నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టుపై చర్చకు వస్తారా?
  • ఇంకా పది సంవత్సరాలు కాంగ్రెస్ పాలనే కొనసాగుతుంది.
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తాం.
  • రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించాలి.
  • రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి.

తుంగతుర్తి, ముద్ర: తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మూడు కోట్ల పది లక్షల మంది పేద ప్రజానీకానికి సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించడమే కాకుండా పది సంవత్సరాలుగా రేషన్ కార్డు లేని అర్హులైన పేద ప్రజలందరికీ 5 లక్షల 60000 కొత్త రేషన్ కార్డులు నేడు తుంగతుర్తి నుండి ఇచ్చిన ఘనత తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యానికి దక్కిందని రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అన్నారు .సోమవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో నిర్వహించిన ప్రజా పాలన రేషన్ కార్డుల పండుగ సభ కు హాజరై ప్రసంగించారు .తుంగతుర్తి నియోజకవర్గం నల్లగొండ జిల్లా అనాదిగా విప్లవ ఖిల్లా అని భీమిరెడ్డి నరసింహారెడ్డి లాంటి యోధులను కన్న గడ్డ అని అలాంటి గడ్డ నుండి పేద ప్రజానీకానికి పనికివచ్చే చక్కటి రేషన్ కార్డుల పంపిణీ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాలను చేపట్టడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు .నల్లగొండ జిల్లాకు రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉందని అన్నారు .భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన గడ్డ నల్లగొండ అని అన్నారు. రజాకారులను తరిమిన ప్రాంతం చాకలి ఐలమ్మ ఆరుట్ల రామచంద్రారెడ్డి దొడ్డి కొమరయ్య రావి నారాయణరెడ్డి లాంటివారు పోరాడిన గడ్డ అని అన్నారు .కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అనేక సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తుందని అన్నారు అందులో భాగంగా 21 వేల కోట్లతో రైతు రుణమాఫీ చేసామని 9,000 కోట్లతో రైతు భరోసా అందించామని అన్నారు తాము రైతు భరోసా అందించలేమని ప్రతిపక్ష బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు వగలమారి ఏడుపులు ఏడ్చారని అన్నారు ఇది కేవలం ఇందిరమ్మ రాజ్యంలోనే కాంగ్రెస్ సర్కార్ తోనే సంక్షేమ పథకాలన్నీ అమలవడం సాధ్యమవుతుందని అన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉండి లక్షల కోట్ల రూపాయలు నిధులను దుర్వినియోగం చేయడమే కాకుండా తమ జేబులు నింపుకున్న ఘనత గత పాలకులదని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు నిర్మించిన ప్రాజెక్టులన్ని నేటి వరకు చెక్కుచెదరకుండా ఉంటే కాలేశ్వరం నేడు కూలేశ్వరం గా మారిందని అన్నారు గోదావరి జిల్లాలు తుంగతుర్తి కి తెస్తానని ఈ ప్రాంతం ఒక నాయకుడు అంటున్నాడని గోదావరి జిల్లాలు తేవడం అంటే గ్లాసులో సోడా పోయడం కాదని ఎద్దేవా చేశారు. నాడు వారి పరిపాలనలో బారిషాపుల ముందు బారులు తీరితే నేడు సన్న బియ్యం కోసం పేద ప్రజలు రేషన్ షాపుల ముందు బారులుతీరుతున్నారని అన్నారు గత పది సంవత్సరాల వారి పాలనలో పండిన పంట కంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోనే అత్యధికంగా రెండు కోట్ల 70 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రెండు పంటలకు పండిందని అన్నారు దీని వెనక రైతుల కృషి ప్రభుత్వ ఆలోచన ఉందని అన్నారు సన్న ధాన్యానికి బోనస్ 500 ఇచ్చామని అన్నారు పండించిన ప్రతి ధాన్యపు గింజ ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేసిందని అన్నారు వ్యవసాయం దండగ కాదు పండుగని నిరూపించామని అన్నారు ఆడబిడ్డలను గత పది సంవత్సరాల వారి పాలనలో ఏనాడు ఆదుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గడచిన సంవత్సరంనర కాలంగా అనేక రంగాల్లో వారికి అవకాశాలు ఇచ్చామని అన్నారు ఆర్టీసీ ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేశామని అన్నారు పేద ప్రజలకు ఉచిత కరెంటు అందిస్తున్నామని అన్నారు సోలార్ విద్యుత్ ప్లాంట్లు పెట్రోల్ బంకులు సుమారు 1000 ఆర్టిసి బస్సులను స్వయం సహాయక సంఘాలు నడిపే విధంగా వారికి అందించామని అన్నారు అలాగే పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడానికి స్వయం సహాయక సంఘాలకు ప్రత్యేకమైన నిధులను ఏర్పాటు చేశామని అన్నారు ఈ విధంగా మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని ఇందిరమ్మ రాజ్యానిది అని అన్నారు తుంగతుర్తి నియోజకవర్గానికి దేవాదుల ద్వారా గోదావరి జల్లాలు తెస్తామని సభాముఖంగా మాట ఇస్తున్నామని అలాగే దేవాదుల6 పూర్తి చేయడం ద్వారా గన్ పూర్ కొడకండ్ల తుంగతుర్తి ప్రాంతాలకు గోదావరి జిల్లాల పుష్కలంగా వస్తాయని అన్నారు దేవాదుల పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యంగా వేలాదిమంది ప్రజల అర్షద్వారాల మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ఎంపీ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామిల్ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ల కోరికల మేరకు దేవాదుల కాలువను తుంగతుర్తి ప్రాంతానికి మంజూరు చేస్తున్నామని అన్నారు అలాగే ఈ ప్రాంతంలో ఉన్న ఒక నాయకుడు గతంలో గంజి తాగేటోడు నేడు బెంజ్ కార్లు ఎలా తిరుగుతున్నాడని వచ్చే ఎన్నికల్లో ఇలాంటి గంజాయి మొక్కలను నల్లగొండ జిల్లాలో మొలవనివ్వరాదని రేవంత్ రెడ్డి అన్నారు తుంగతుర్తి నియోజకవర్గంలో 60 వేల మెజార్టీతో ఎమ్మెల్యేగా మందుల సామేలను గెలిపించారని తుంగతుర్తి ప్రజానీకానికి ప్రత్యేక కృతజ్ఞతలు అని ముఖ్యమంత్రి అన్నారు ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలందరినీ కలుపుకొని పోవాలని చిన్న చిన్న సమస్యలు ఉంటే జిల్లా మంత్రి లేదా పిసిసి అధ్యక్షుడు అంతకన్నా పెద్ద సమస్య అయితే తన వద్దకు తీసుకురావాలని సూచించారు తుంగతుర్తి నియోజకవర్గం తో పాటు సూర్యాపేట జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నింటిని కాంగ్రెస్ కైవసం చేసుకోవాలని అందరూ కలిసికట్టుగా పోరాడాలని అన్నారు ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ గడ్డ అని మరోమారు నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు తెలంగాణలో కులగణన చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచామని నేడు ప్రధాని మెడలు వంచి దేశవ్యాప్తంగా కులగణ న చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ చేసిందని అన్నారు అలాగే దేశంలో మరెక్కడా లేనివిధంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అమలు ఒక తెలంగాణలోనే జరిగిందని అన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు ఎన్ని చెప్పినా బీసీలకు 42 శాతం అమలు చేస్తామని అన్నారు ప్రజలు అభివృద్ధి చేస్తున్న తమ ప్రభుత్వానికి ఎల్లవేళలా అండగా నిలవాలని తాము మరింత అభివృద్ధి చేసే విధంగా ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి కోరారు.

Leave A Reply

Your email address will not be published.