Take a fresh look at your lifestyle.

మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలి

  • రాజకీయాలకతీతంగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు.
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు.

మధిర, ముద్ర విలేఖరి : మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కమల్లు ఆకాంక్షించారు. రాష్ట్ర సెర్ప్ సీఈవో డి దివ్య, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి. పోలీస్ కమిషనర్ సునీల్ దత్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తో కలిసి సోమవారం చింతకాని మండలంలో మధిర నియోజకవర్గస్థాయి మహిళా శక్తి సంబరాల్లో పాల్గొని వడ్డీ లేని రుణాల చెక్కులు, చింతకాని మండల ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండ్లు లేని పేదల ఉండకూడదని ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మొదటి దశలో రాష్ట్రంలో 4.5 లక్షల ఇళ్ల నిర్మాణానికి రూ 22.5 వేల కోట్ల మంజూరు చేశామన్నారు. రాజకీయాలకతీతంగా పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు. గత పాలకులు నిర్లక్ష్యం చేసిన వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం పునరుద్ధరించి మొదటి సంవత్సరంలో రూ  21 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామన్నారు. ఐదు సంవత్సరాలలో లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలను స్వయం సహాయక సంఘాలకు అందిస్తామన్నారు.మధిర నియోజకవర్గం లోని 4590 స్వయం సహాయక సంఘాల సభ్యులకు రూ 5.93 లక్షల వడ్డీ లేని రుణాల చెక్కులను అందించారు. సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం రైతులు భూమి లీజుకు ఇవ్వడానికి ముందుకు వస్తే సంవత్సరానికి 35వేల లీజు చెల్లిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జడ్పీ సీఈవో దీక్షారైన, డి ఆర్ డి ఓ సన్యాసయ్య, డిపిఓ ఆశాలత, హౌసింగ్ పీడీ భూక్య శ్రీనివాస్, జిల్లా వైద్య శాఖ అధికారిని డాక్టర్ కళావతి భాయ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.