Take a fresh look at your lifestyle.

వట్టెంలో డిపెప్ మిత్రుల రజితోత్సవ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహణ

 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:

జిల్లా ప్రాథమిక విద్యా పథకం (DPEP) క్రింద విజయవంతంగా పనిచేసి విద్యా లక్ష్యాల సాధనలో విశేష కృషి చేసిన రిసోర్స్ పర్సన్స్ గ్రూప్ 25 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా వట్టెంలో రజితోత్సవ ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు.

వట్టెం గుట్టపై వెలసిన శ్రీ వేంకటేశ్వర స్వామి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాలకు చెందిన సుమారు 100 మంది మిత్రులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా అప్పటి అసిస్టెంట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సందడి ప్రతాపరెడ్డి హాజరై కార్యక్రమాన్ని అభినందించారు.

ఈ సందర్భంగా పాల్గొన్న సభ్యులు తమ తమ జిల్లాల్లో విద్యా రంగ అభివృద్ధికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ముఖ్యంగా పాఠశాల అభివృద్ధిలో గ్రామస్తుల పాత్ర, విద్యా ప్రమాణాల పెంపు కోసం చేపట్టిన కార్యక్రమాలపై తమ అనుభవాలను పంచుకున్నారు.

ఈ కార్యక్రమానికి అప్పటి నాలుగు జిల్లాల శిక్షణ ఇన్చార్జ్‌గా వ్యవహరించిన గాడి సురేందర్ అధ్యక్షత వహించారు. నాగర్ కర్నూలుకు చెందిన బి. వేణుగోపాల్, అడ్డాకులుకు చెందిన శివకుమార్, వనపర్తికి చెందిన విష్ణువర్ధన్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, కల్వకుర్తికి చెందిన చంద్రశేఖర్, పెద్దమందడికి చెందిన వరప్రసాద్, రమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.