- సివిల్ సర్వెంట్ల భూ దందా.
- భూదాన్ భూములు కొనుగోలు చేసిన సీనియర్ అధికారులు.
- చేసిందంతా ఒక ఐఏఎస్.. చేపించింది హయ్యర్ ఆఫీషియల్స్.
- భూదాన్ భూములు కొన్నవారిలో 33 మంది.
- బినామీల పేరుతో కొందరు.. సొంతంగా మరికొందరి పేరుతో పట్టాలు.
- సివిల్ సర్వెంట్ల విషయంలో రంగంలోకి ఈడీ.
- మధ్యవర్తిగా పాతబస్తీ వ్యాపారులు.
- అమ్మిన సంస్థ ఈఐపీఎల్.
- కొనుగోళ్లపై కూపీ లాగుతున్న ఈడీ.
ముద్ర, తెలంగాణ బ్యూరో :రాష్ట్రంలో మరో భారీ కుంభకోణం బయటకు వస్తున్నది. చట్టాన్ని కాపాడాల్సినవారే అతిక్రమించారు.గత ప్రభుత్వంలో కొన్ని లొసుగులు తమ పవర్‌ను వాడుకుని ఏకంగా భూదాన్ భూములను కొనుగోలు చేసి పట్టాకెక్కారు.ఒక్కరు కాదు ఇద్దరు కాదు 33 మంది సివిల్ సర్వెంట్లు ఈ భూ దందాకు దిగారు. ఇప్పటికీ వారందరి పేరిట భూములున్నాయి.చట్టవిరుద్ధంగా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, పలువురు ఉన్నతాధికారులు ఈ భూదాన్ భూములు కొనుగోలు చేసినట్లు వెల్లడవుతున్నది.ఈ భారీ కుంభకోణంపై అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) గతంలోనే రంగంలోకి దిగింది. అప్పుడు కలెక్టర్‌గా ఉన్న ఐఏఎస్ అధికారి అమయ్ కుమార్‌తో పాటు రెవెన్యూ అధికారులను విచారించింది. తాజాగా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, పలువురు ఉన్నతాధికారుల పేర్లు బయటకు రావడంతో ఇప్పుడు ఎక్కడ నుంచి ఎలా భూములు కొనుగోలు చేసిందనే వివరాలను రాబట్టుతున్నది.ఈ వ్యవహారంలో పాతబస్తీకి చెందిన కొంతమంది వ్యాపారులు మధ్యవర్తులుగా వ్యవహరించినట్లు ఈడీ గుర్తించింది. ఇక, భూదాన్ భూములను ఈఐపీఎస్ అనే నిర్మాణ సంస్థ నుంచి కొనుగోలు చేసినట్లు పత్రాలు సృష్టించారు.
- కొన్నారా.. ఆక్రమించారా..?
పేదల కోసం కేటాయించిన భూదాన్ భూములను రాష్ట్రంలోని పని చేసిన ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, పలువురు ఉన్నతాధికారులు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు.వీరిలో కొంతమంది తమ పేర్లతోనే నేరుగా కొనుగోలు చేస్తే మరికొందరు తమ కుటుంబ సభ్యుల పేర్ల పైకి మార్చుకున్నారు.కానీ, ఈ భూదాన్ భూములను కొనుగోళ్లు చేయకుండా ఒక సంస్థ ద్వారా కొనుగోలు చేసినట్లు పత్రాలు సృష్టించుకున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి.ఈ భూముల వ్యవహారంలో ఇప్పటికే పలువురు అధికారులు వివాదంలో ఉన్నారు.దీంతో గతంలోనే భూదాన్ భూముల వ్యవహారంలో ఉన్నతాధికారులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఈడీ, సీబీఐల దర్యాప్తు చేయాలని కేంద్రానికి హైకోర్టు నుంచి నోటీసులు ఇచ్చారు.మేడ్చల్ జిల్లా నాగారంలోని సర్వే నెంబర్లు 181,182,194,195 లోని భూదాన్ బోర్డుకు చెందిన భూములను ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, పలువురు ఉన్నతాధికారులు కొనుగోలు చేసినట్లు తేలింది. కానీ, వీటినికొనుగోలు చేయకుండా అప్పుడున్న కలెక్టర్, రెవెన్యూ అధికారులతో కలిసి ఆక్రమించినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.పేదల వర్గాలకు సాగు నిమిత్తం, ఇళ్ల నిర్మాణాల కోసం కేటాయించిన ఈ భూములను నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసినట్లుగా ఈడీ భావిస్తున్నది.
- రంగంలోకి దిగిన ఈడీ.
గతంలో నుంచే భూదాన్ భూముల వ్యవహారంలో విచారణ చేస్తున్న ఈడీ తాజాగా సివిల్ సర్వెంట్లు కూడా ఈ దందాలో ఉన్నట్లు అనుమానాలు రావడంతో ఎన్‌ఫోర్స్ మెంట్ అధికారులు హైదరాబాద్ లో తనిఖీలు చేపట్టారు.హైదరాబాద్‌లో పాతబస్తీ సహా 8 చోట్ల ఈడీ ఆకస్మిక దాడులు చేశారు. సంతోష్ నగర్, యాకుత్ పురా సహా నగరంలోని మొత్తం 8 ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు చేశారు.మహేశ్వరం పరిధిలోని భూదాన్ భూముల విషయంలో ఈ తనిఖీలు జరిపారు. పాతబస్తీలోని మన్వర్ ఖాన్, ఖదీర్ ఉన్నిస్, సర్ఫాన్, సుకూర్ ఇళ్లలో, పలువురు ఐఏఎస్, అధికారుల ఇళ్లల్లో ఈడీ అధికారులు సోదాలు చేసినట్లు ప్రచారం జరిగింది. మధ్యవర్తులుగా వ్యవహరించిన మన్వర్ఖాన్, ఖదీర్ ఉన్నిస్, సర్ఫాన్, సుకూర్ఇండ్లలో మాత్రం ఈడీ సోదాలు జరిగాయి. ఈఐపీఎల్ కంపెనీ పలువురు ఐఏఎస్, ఐపీఎస్ లకు ఈ భూములు విక్రయించినట్లుగా పత్రాల్లో ఉంది.ఈ కంపెనీకి సుకూర్ బినామీగా ఉండగా అతడి నివాసంతో పాటు అతడి సన్నిహితులు సర్ఫాన్, మరికొందరి ఇళ్లలో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు.భూదాన్ భూముల కొనుగోలు వ్యవహారంలో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తో పాటు మహేశ్వరం ఎమ్మార్వోను ఈడీ అధికారులు విచారించారు. వారిని ప్రశ్నించి స్టేట్మెంట్ తీసుకున్నారు. ఈ సోదాలు భూదాన్ భూముల వ్యవహారానికి సంబంధించినవి కావడంతో ఈ కేసు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.అంతేకాకుండా ఈఐపీఎల్ కంపెనీకి సుకూర్ అనే వ్యక్తి బినామీగా వ్యవహరిస్తున్నట్లు ఈడీ అధికారులు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈడీ అధికారులు సుకూర్‌తో పాటు అతని బంధువు షర్ఫన్, మరో ఇద్దరి వ్యక్తుల నివాసాలలో విస్తృతమైన సోదాలు చేపట్టారు.ఈ సోదాల్లో భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన కీలకమైన పత్రాలు, ఇతర ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఐఏఎస్ అధికారి అమయ్ కుమార్, రెవెన్యూ అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ సోదాలు మరింత లోతుగా సాగుతున్నట్లు తెలుస్తోంది. మహేశ్వరం ప్రాంతంలోని సుమారు వంద ఎకరాల భూదాన్ భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించి లేఅవుట్లు వేసి అమ్మకాలు జరిపినట్లు ఆరోపణలు రావడంతో ఈడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.ఈడీ అధికారులు ఇప్పుడు ఈ భూముల అసలు యజమానులు ఎవరు, ఎవరెవరికి ఈ భూములు అక్రమంగా బదిలీ అయ్యాయి.ఈ ప్రక్రియలో ఎవరెవరు లబ్ధి పొందారు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.ముఖ్యంగా ఈఐపీఎల్ కంపెనీకి, సుకూర్‌కు మధ్య ఉన్న సంబంధం ఏమిటి..? ఈ భూముల విక్రయాలలో వారి పాత్ర ఏమిటి అనే విషయాలను ఈడీ నిశితంగా పరిశీలిస్తోంది. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఈ భూములు ఎలా విక్రయించబడ్డాయి..?ఈ లావాదేవీలలో ఎటువంటి నిబంధనలు ఉల్లంఘించబడ్డాయి అనే విషయాలను కూడా ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు.ఈ సోదాలు, విచారణలు రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది.
- భూములు కొనుగోలు చేసిన అధికారుల పూర్తి జాబితా.
1) బత్తుల హేమలత (C/o బత్తుల శివధర్ రెడ్డి IPS-20 గుంటలు)
2) ప్రియాంక రతన్ (C/o దివంగత రాజీవ్ రతన్ IPS-16 గుంటలు)
3) రవి గుప్త (IPS-16 గుంటలు)
4) ముదిరెడ్డి నితీష్ రెడ్డి (S/o మహేందర్ రెడ్డి IPS-20 గుంటలు)
5) తాటిపర్తి పావని రావు (C/o T. ప్రభాకర్ రావు IPS-16 గుంటలు)
6) రేఖ షరాఫ్ (C/o ఉమేష్ షరాఫ్ IPS-16 గుంటలు)
7) రాజర్షి సాహా (IPS-8 గుంటలు)
8) స్వాతి లక్రా (IPS-16 గుంటలు)
9) మిట్టీ సతితి సుహానా (C/o మిట్టీ శ్రీనిబసు-8 గుంటలు)
10) నందిని మాన్ (C/o విక్రమ్ సింగ్ మాన్ IPS -8 గుంటలు)
11) డాక్టర్ జ్ఞాన్ ముద్ర (C/o సోమేష్ కుమార్ IAS-20 గుంటలు)
12) బి.కె. రాహుల్ హెగ్డే (స్వయం-8 గుంటలు)
13) సవ్యసాచి ప్రతాప్ సింగ్ (C/o గోవింద్ సింగ్-8 గుంటలు)
14) జి. ఓం అనిరుధ్ (C/o సుధీర్ బాబు IPS-నాట్ స్పెసిఫైడ్)
15) ఇందు రావు కావేటి (C/o లక్ష్మీనారాయణ రావు కావేటి-16 గుంటలు)
16) న్యాలకొండ సింధు రెడ్డి (C/o న్యాలకొండ ప్రకాష్ రెడ్డి-20 గుంటలు)
17) ఐశ్వర్య రాజ్(C/o వికాస్ రాజ్-20 గుంటలు)
18) వెన్నవెల్లి రాధిక(C/o కమలాసన్ రెడ్డి-16 గుంటలు)
19) రీతా సుల్తానా (C/o సందీప్ కుమార్ సుల్తానా-20 గుంటలు)
20) వసుంధర సిన్హా (C/o అంజనీ కుమార్-20 గుంటలు)
21) ముత్యాల వినీల (C/o స్టీఫెన్ రవీంద్ర IPS-8 గుంటలు)
22) అజిత్ కుమార్ మొహంతి (C/o ఖేస్త్రబాసి మొహంతి-20 గుంటలు)
23) నవీన్ మిట్టల్ (సెల్ఫ్-20 గుంటలు)
24) సౌమ్య మిశ్రా (సెల్ఫ్-16 గుంటలు)
25) రాహుల్ బుసి రెడ్డి (S/o బి. జనార్దన్ రెడ్డి IAS-16 గుంటలు)
26) తరుణ్ జోషి(సెల్ఫ్ IPS-16 గుంటలు)
27) పీర్ల వరుణ్ (పీర్ల విశ్వ ప్రసాద్-16 గుంటలు)
28) తోట శ్రీనివాసరావు (S/o తోట సాయిబాబా IPS-నాట్ స్పెసిఫైడ్)
29) కొండూరు శ్రీనాథరాజు (S/o కొండూరు సత్యనారాయణ-20 గుంటలు)
30) మహేష్ భగవత్ (సెల్ఫ్-16 గుంటలు)
31) రేణు గోయల్ (కమాండర్ జితేందర్ కుమార్ గోయల్-20 గుంటలు)
32) అజయ్ జైన్ (సెల్ఫ్-20 గుంటలు)
33) అమిత కుమార్ (C/o అనిల్ కుమార్-20 గుంటలు)

