ముద్ర,తాండూరు:
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ధోబి ఘాటుకు కేటాయించిన స్థలంలో రక్షణగా ఉన్న ప్రహరీ గోడను కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డ్ కౌన్సిలర్ రాము అక్రమంగా కూలగొట్టిన విషయంపై రజక సంఘం నాయకులు ప్రశ్నించడంతో దాడికి తెగబడ్డారని ప్రజాసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిలర్ రాము రజక సంఘం నాయకుల పై దాడి చేసి ఐదు రోజులు గడిచిన తాండూర్ పట్టణ పోలీసులు చర్యలు తీసుకోవడంలో తాత్సారం చేస్తున్నారని విమర్శించారు. దోబీ ఘాట్ కు చెందిన 70 గుంటల స్థలంలో కాంగ్రెస్ కౌన్సిలర్ రాము సీసీ రోడ్డు వేస్తామని చెప్పి అక్రమంగా కూల్చారని వికారాబాద్ జిల్లా రజక సంఘం అధ్యక్షులు కృష్ణ తెలిపారు. ఈ స్థలాన్ని అభివృద్ధి పనుల పేరిట కబ్జా చేసేందుకే కౌన్సిలర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రహరీని ఎందుకు కూల్చావని ప్రశ్నించినందుకే రజక సంఘం నాయకుల పై అకారణంగా దాడి చేశారని అన్నారు. కౌన్సిలర్ రాముపై తాండ్ర పట్టణ పోలీసులకు మూడు రోజుల కిందటే ఫిర్యాదు చేశామని ఆయన ఇప్పటివరకు పోలీసులు ఆయనపై చర్యలు తీసుకోవడం లేదని వికారాబాద్ జిల్లా సిఐటియు నాయకులు శ్రీనివాస్ అన్నారు. గత ఐదు రోజులుగా తాము నిరసనలు వ్యక్తం చేస్తున్న పోలీసులు పట్టించుకోవడంలేదని రజక సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Next Post