రామకృష్ణాపూర్, ముద్ర విలేకరి : పోలీసులు ఎంత చెప్పిన మందు బాబులలో ఏ మాత్రం మార్పు రావడం లేదు. జననివాస ప్రాంతాలతో పాటు దేవాలయాల వద్ద మద్యం సేవిస్తూ ప్రజలకు,స్థానికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. స్థానిక సూపర్ బజార్ షిరిడి సాయిబాబా ఆలయం వద్ద గురువారం రాత్రి జరిగిన ఓ పెండ్లి భారత్ లో కొందరు ఆలయ ప్రహరీ గోడ వద్ద మద్యం సేవించారు. అనంతరం ఖాళీ సీసాలను అక్కడే వొదిలేసి వెళ్లారు. శుక్రవారం తెల్లవారుజామున సీసాలను చూసిన స్థానికులు మందుబాబుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆలయానికి వచ్చే భక్తులకు మద్యం సీసాలు దర్శనం ఇస్తున్నాయి. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్లుగా మద్యం సేవిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై స్థానిక పోలీసులు చట్టరీత్య చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.