అధికారులుగా వ్యవహరించిన విద్యార్థుల పనితీరు గ్రామ ప్రజల్ని విశేషంగా ఆకట్టుకుంది

ముద్ర, భువనగిరి జిల్లా ప్రతినిధి :
రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామ ప్రాథమిక పాఠశాలలో శనివారం స్వపరిపాల దినోత్సవ కార్యక్రమాన్ని విద్యార్థులచే వినూత్నంగా ఏర్పాటు చేయడంతో గ్రామ ప్రజల మన్నలను పొందారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. ఉపేందర్ తెలిపారు.
విద్యాశాఖ మంత్రిగా అంకిరెడ్డి జశ్విక , విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా కన్నెబోయిన లిఖిత , కలెక్టరుగా చిల్లా యోగిత, ఎమ్మెల్యేగా చిల్లా రాకేష్ , జిల్లా విద్యాధికారి నడిగోటి తనుస్వి ఎంఈఓ గా రియన్, యం ఆర్ ఓ గా శుష్మ యం.పి.డి.ఓ గా మైథిలి పాఠశాల హెచ్ఎం గా బుర్ర అక్షిత వ్యవహరించారు.
గ్రామంలో అధికారులు ర్యాలీగా వెళ్లి అక్కడక్కడ గ్రామ సమస్యలు తెలుసుకొని గ్రామ పంచాయతీ ఇందిరమ్మ ఇండ్ల పరిశీలనలో ఎమ్మెల్యే పాల్గొన్న అనంతరం పాఠశాలలో పలు తరగతులు సందర్శించారు. వీరు చేసిన కృషికి పలువురు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. ఉపేందర్ జి, ఉపాధ్యాయులు జి గణేష్ , పి గోపాల్ రెడ్డి , కృష్ణ, స్వర్ణలత , ప్రశాంతి , ఎస్ఎంసి చైర్మన్ చిల్లా హేమలత మురళీకృష్ణ , మాజీ సింగిల్ విండో డైరెక్టర్ పిట్ట రాం రెడ్డి , వేముల సైదులు , చిల్ల భవాని , మధు, కావ్య వెంకట్, కమలాకర్ , ప్రమీల, సంధ్య , ధనమ్మ సుభద్ర పాల్గొన్నారు.