Take a fresh look at your lifestyle.

ఐ ఎన్ టి యు సి జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డిని కలిసిన జనక్ ప్రసాద్,ముఖ్య నేతలు

ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: ఐ ఎన్ టి యు సి జాతీయ అధ్యక్షుడు డా:జి.సంజీవరెడ్డిని శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో సెక్రటరీ జనరల్ బి. జనక్ ప్రసాద్ నేతృత్వంలో సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ ఐ ఎన్ టి యు సి ముఖ్య నాయకుల బృందం మర్యాదపూర్వకంగా కలిసారు.ఈ సందర్భంగా సింగరేణి కార్మికులకు సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు.ముఖ్యంగా జూలై 9వ తేదీన జరిగే జాతీయ సమ్మె, కార్మికుల సొంత ఇంటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వంతో చర్చలు జరిపిన అంశం,కార్మికుల పెర్క్స్ మీద,ఐటి మాఫీ,డిస్మిస్ కార్మికుల సమస్యలు, మారుపేర్ల మార్పు,కొత్త బొగ్గు గనుల ప్రారంభం వంటి కీలక అంశాలపై చర్చ జరిగింది.ఈ సమావేశంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహరెడ్డి, పి.ధర్మపురి, సంపెల్లి సమ్మయ్య,సి.త్యాగ రాజన్, జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ దాస్, జనరల్ సెక్రటరీ అక్రమ్, రీజినల్ జనరల్ సెక్రటరీ ఆల్బర్ట్,వైస్ ప్రెసిడెంట్లు భూమయ్య, రజాక్, పీతాంబరం, సీనియర్ నాయకులు శంకరరావు, పానుగంటి వెంకటస్వామి, చంద్ర శేఖర్, బాబు, జగన్నాథచారి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.