చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ఇందిరా పార్క్ వద్ద జరిగే రిలే నిరాహార దీక్షలను జయప్రదం చేయండి: చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతి కుమార్
ముద్ర, వలిగొండ :
మార్చ్ 25 వ తేదీన జరిగే రిలే నిరాహార దీక్షను చేనేత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతి కుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేనేత సోదరులు పోరాటాల ఫలితంగా సాధించుకున్న పథకాలైన జాతీయ చేనేత బోర్డు, హ్యాండీక్రాఫ్ట్ బోర్డు, మహాత్మా గాంధీ బునకర్ బీమా యోజన, ఐసిఐసిఐ లాంబార్డ్ హెల్త్ స్కీమ్, హౌస్ కం వర్క్ షెడ్ పథకాలను అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వ రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వం చేనేత పరిశ్రమ ముడి సరుకులైన రంగులు రసాయనాలతో పాటు చేనేత చీరలపై జిఎస్టి విధించి దేశవ్యాప్తంగా చేనేత పరిశ్రమను చావు దెబ్బతీసింది అని విమర్శించారు.
ఈ సమావేశంలో చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు గర్దాసు నరసింహ, దొంత శంకరయ్య, జెల్ల నరేందర్, సాయిని యాదగిరి, గంజి వెంకటేశ్వర్లు, గుంటి రవీందర్, జెల్ల నరహరి, రాపోలు శ్రీనివాస్, మిర్యాల వెంకటేశం, అయిటిపాముల మీనయ్య, మిర్యాల శేఖర్, రచ్చ సంతోష్, చిందం సత్తయ్య, కర్నాటి వెంకటేశం, మూడుదుడ్ల శేఖర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.