Take a fresh look at your lifestyle.

ప్రశాంతంగా పీపీటీ ప్రవేశ పరీక్ష

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
పీపుల్స్‌ ప్రోగ్రెస్‌ ట్రస్ట్‌ వారి ఆధ్వర్యంలో ప్రగతి విద్యానికేతన్‌ పరీక్ష ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రశాంతంగా జరిగింది. భువనగిరి జిల్లా కేంద్రంలోని తీరందాస్‌ గోపి మీటింగ్‌ హాల్‌ లో టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా కమిటీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రవేశ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలను తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ (టీఎస్‌ యుటిఎఫ్‌) జిల్లా అధ్యక్షులు ముక్కెర్ల యాదయ్య,ప్రధాన కార్యదర్శి మెతుకు సైదులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలోని అనాధ , పాక్షిక అనాధ, నిరుపేద విద్యార్థులకు ఉచితంగా హైద్రాబాద్‌ లోని ప్రగతినగర్‌ లో రెసిడెన్షియల్‌ విద్యను అందించడం జరుగుతుదని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న వారు, జనగాం, నిజామాబాద్‌ విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. వారం రోజులు లోపు ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను వెల్లడిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆడిట్‌ కమిటీ సభ్యులు గుజ్జ బాలయ్య, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు, పి పి టి పరీక్ష పరిశీలకులు ప్రగతి, శ్రీవాణి , జిల్లా కమిటీ సభ్యులు కంచిగట్ల వెంకన్న, కోక వేణు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.