పోలింగ్ సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్..
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి , కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం 6 మున్సిపాలిటీ లలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ ప్రక్రియ లో బాగంగా జిల్లా కలెక్టర్ పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో, చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిగూడెం లో, భువనగిరి బీచ్ మహల్ లోని జిల్లా పరిషత్ హై స్కూల్లో, యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని కొత్త గుండ్లపల్లి లో, ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని గ్రీన్ మోడల్ పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీలలో ఏర్పాటుచేసిన గ్రీన్ మోడల్ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు విశేష ఉత్సాహంతో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్రాల్లో పచ్చని మొక్కలు, పూల అలంకరణ, కొబ్బరి తోరణాలు, ప్లాస్టిక్ రహిత సామాగ్రి, పర్యావరణహిత అలంకరణతో ఓటర్లకు మైమరిపించే అనుభూతిని కల్పించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడం జరుగుతుందన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, పోలింగ్ సిబ్బంది విధుల నిర్వహణ తీరును పర్యవేక్షించారు. శాంతియుతంగా, పారదర్శకంగా మరియు ఎన్నికల నియమావళి ప్రకారం కొనసాగుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, నీడ, ర్యాంపులు, వీల్‌చైర్‌లు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్, సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ జరుగుతోందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ సిబ్బంది సమయపాలనతో విధులు నిర్వహించాలని, ఎన్నికల నియమాలను కచ్చితంగా పాటించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.జిల్లా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.