Take a fresh look at your lifestyle.

బెదిరింపులకు భయపడను

  • ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొంటా.
  • బీజేపీ ఎంపీ రఘునందన్ రావు.
  • తనను చంపేస్తామంటూ వచ్చిన ఫోన్​ కాల్ పై వీడియో రిలీజ్​.

ముద్ర, తెలంగాణ బ్యూరో : తనను చంపుతానంటూ వస్తోన్న బెదిరిస్తూ వస్తున్న ఫోన్​ కాల్స్​ తో భయపడే ప్రసక్తే లేదని మెదక్​ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు. తానే కాదూ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎవరూ కూడా ఇలాంటి బెదిరింపు కాల్స్ కు ఆందోళనకు గురికాబోమని తేల్చి చెప్పారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తనను చంపేస్తామంటూ మధ్యప్రదేశ్ మావోయిస్టుల పేరుతో వచ్చిన ఫోన్ కాల్ నేపథ్యంలో సోమవారం ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు.మధ్యప్రదేశ్ పీపుల్స్ వార్ మావోయిస్టు పేరుతో తనకు బెదిరింపు కాల్ వచ్చిందని అన్నారు. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడెంలోని ఓ పాఠశాల కార్యక్రమంలో ఉండగా +912143352974 నంబర్ నుంచి తనకు ఫోన్ చేసి ఇప్పుడే మధ్యప్రదేశ్ నుంచి మావోయిస్టు పార్టీ దళం బయలుదేరిందనీ, సోమవారం అర్థరాత్రి లోపు నన్ను చంపేస్తామని హెచ్చరించారని చెప్పారు. ఈరోజు అర్థరాత్రి వరకే డెడ్ లైన్ అని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ రెండోసారి కూడా ఫోన్ చేశారన్నారు.ఆపరేషన్ కగార్ ను ఆపేందుకు మావోయిస్టు పార్టీ ఏదైనా సెన్సేషన్ కోసం ప్రయత్నిస్తోందా? తెలియడం లేదన్నారు. ఈ క్రమంలో ఎవరిని బలితీసుకోబోతున్నారో అనేది తాము ఆందోళన చెందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా బెదిరింపు కాల్‌తో అప్రమత్తమైన ఎంపీ రఘునందన్‌ రావు వెంటనే రాష్ట్ర డీజీపీ జితేందర్​, మెదక్ ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.ఎంపీ రఘునందన్‌ ఫిర్యాదుతో పోలీస్‌ శాఖ ఉన్నతాధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Leave A Reply

Your email address will not be published.