Take a fresh look at your lifestyle.

ప్లాస్టిక్ నష్టాలపై అవగాహన అవసరం పర్యావరణ శాస్త్రవేత్త తిరుపతి

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ప్లాస్టిక్ వాడకం వల్ల ఎదురవుతున్న అనర్థాలపై విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి శాస్త్రవేత్త తిరుపతి విద్యార్థులను కోరారు. బైంసా పట్టణంలోని జిపిఎల్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు, సింగిల్ యూసేజి ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలపై ఆయన అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను పవర్ పాయింట్ ద్వారా వివరించారు. ప్లాస్టిక్ వాడటం వల్ల ప్రజల్లో ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, సింగిల్ యూసేజి ప్లాస్టిక్ నిషేధం లో ప్రతి ఒక్కరూ తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయ మార్గాలను ఆయన విద్యార్థులకు వివరించారు. సిపిసిబి (CPCB) రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన బయో-డిగ్రేడబుల్ సంచుల వివరాలను విద్యార్థులకు వివరించారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.