Take a fresh look at your lifestyle.

మాజీ మంత్రి… డ్రామా తగ్గించు

 

– పేదల భోజనం పై మాజీ మంత్రి రాజకీయ డ్రామా
– పేదల భోజనం షెడ్ పడగొట్టిందే మాజీ మంత్రి
– పేదలంటే ఇప్పుడు గుర్తుకొచ్చారా.. ఓట్ల డ్రామా ఇకనైనా ఆపు
– షెడ్ వేస్తానని నిన్న మాటిచ్చా… నేడు నేరవేర్చా ..
– పాలమూరు మున్సిపల్ డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి
…………………………………….
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
………………………………………
తన హయాంలో పేదలు భోజనం చేసే కొత్త భవనం కూల్చి వేసి అధికారం పోయిన వెంటనే భోజన శాల చినిగిన టెంట్ చూపిస్తూ రాజకీయ డ్రామా ఆడుతున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పద్ధతి మార్చుకోవాలని పాలమూరు మున్సిపల్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి హితవు పలికారు. స్థానిక బస్ స్టాండ్ వద్ద పేదల కోసం రూ. 5 కే భోజనం పెడుతున్న ప్రాంతం లో ఎండ కు తినకుండా వారి కోసం వేసిన టెంట్ చినిగి పోయిన పట్టించుకోవడం లేదనే విమర్శలు మున్సిపాలిటీ అధికారులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయం పై బుధవారం మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ భోజన శాల వద్ద చిరిగిన టెంట్ ను చూపిస్తూ విమర్శించారు. ఈ విషయం తెలుకున్న డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి ఈ టెంట్ వద్దకు వెళ్లి గురువారం లోగ కొత్త షెడ్ వేయిస్తానని హామీ ఇచ్చారు. అనుకున్న విధంగా గురువారం రేకులతో షెడ్ వేయించారు. ఈ షెడ్ ను స్థానిక మేయర్ గుమాల మమత ప్రారంభించి అక్కడే భోజనం చేశారు. అనంతరం సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ భోజనం చేసేందుకు రూ. కోటి తో భవనాన్ని నిర్మించారని, ఇది నిర్మించిన కొద్ది రోజులకే మాజీ మంత్రి కూల్చి వేయించారని ఆయన పేర్కొన్నారు. భవనం కూల్చి తాత్కాలికంగా టెంట్ వేశారని, ప్రస్తుతం అది రంద్రాలు పడిపోవడం తో భోజనం చేసేవారికి నీడ కరువైందని ఆయన మొసలి కన్నీరు కారుస్తున్నారని డిప్యూటీ మేయర్ విమర్శించారు. మాజీ మంత్రి కి పేదలంటే ప్రేమ కాదని, ఆయనకు వారిపై ఉన్నది ఓట్ల డ్రామా అని అన్నారు. ఈ నియోజకవర్గం ప్రజలు ఆయనను ఛీ కొట్టినా ఇంకా మార్పు రాలేదన్నారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సహకారం తో భోజనం చేసే వద్ద ఒక్క రోజులోనే కొత్త షెడ్ వేయించామన్నారు. మీలాగా మాట ఇచ్చి మాట తప్పే నాయకున్ని కాదని ఇచ్చిన మాట కోసం నిలబడే నాయకున్ని అని సురేందర్ రెడ్డి పేర్కొన్నారు. పేదల అభివృద్ధి కోసం పాలమూరు మున్సిపాలిటీ కట్టుబడి ఉందని, పట్టణ ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆడుకునేందుకు ముందుంటామన్నారు.ఈ ​ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, నేతలు మున్నూర్ రవి, మైత్రి యాదయ్య, రాములు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు మోసిన్, ప్రవీణ్ కుమార్, కిషన్ నాయక్, రమేష్ రెడ్డి, పెద్ద గొల్ల నర్సింహులు,సందీప్, గూడెం ఆంజనేయులు, సంజీవ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.