Take a fresh look at your lifestyle.

మగ శిశువును అమ్మేసిన తండ్రి అరుగురిపై పోలీసు కేసు

ముద్ర ప్రతినిధి, మెదక్:*
కన్న తండ్రే 30 రోజుల శిశువును అమ్మేశాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా
హవేలీ ఘనపూర్ మండలంలోని ఓ తండాకు చెందిన నెల మగ శిశువును విక్రాయించిన విషయం సోమవారం వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం కంజర్ల గ్రామంలో శిశువు ఉన్నట్టు గుర్తించి రాత్రి అక్కడికి వెళ్లి స్వాధీనం చేసుకున్న మగ శిశువు (బాలుడి), తల్లిని మెదక్ పట్టణంలోని సఖి కేంద్రానికి మంగళవారం తెల్లవారుజామున తరలించారు. డబ్బుల కోసం తన భర్తే వేరొకరికి అమ్మినట్టు శిశువు తల్లి అధికారులకు తెలిపింది.
అరుగురిపై కేసు నమోదు: డిఎస్పీ ప్రసన్న కుమార్  శిశువు విక్రయానికి సంబంధించి వివరాలను మెదక్ డిఎస్పి ప్రసన్నకుమార్ మీడియాకు వెల్లడించారు. హవెలి ఘనపూర్ (మం) లింగసానిపల్లికి చెందిన ఓ వ్యక్తికి
గత ఏడాది రెండవ వివాహం జరిగింది.గత నెల ఫిబ్రవరి 10న మెదక్ ఎంసిహెచ్ లో మగ శిశువుకు తల్లి జన్మనిచ్చిందన్నారు.
ఆర్థిక ఇబ్బందులు, తాగుడుకు బానిసై కన్నా తండ్రి కన్న కుమారున్ని విక్రయించాడని తెలిపారు. 5 లక్షలకు బేరం పెట్టిన కన్నా తండ్రి అగ్రిమెంట్ రాసుకుని రూ.1,70 లక్షలకు విక్రయించినట్లు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాకు చెందినా సంతానం లేని దంపతులు శిశువును కొనుగోలు చేశారన్నారు. శిశు విక్రయంపై ఫిర్యాదు రావడంతో ప్రత్యేక టీం ఏర్పాటు చేసి విచారణ చేపట్టినట్లు వివరించారు. ఇందుకు సంబంధించి అరుగురిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. ఈ సమావేశంలో సీఐ జార్జీ, హవెలి ఘనపూర్ ఎస్ఐ సత్యనారాయణ ఉన్నారు

Leave A Reply

Your email address will not be published.