Take a fresh look at your lifestyle.

మహిళలు పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి – టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి.

ముద్ర ప్రతినిధి ,సంగారెడ్డి.
సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మహిళలు ప్రతి రంగంలో అద్భుతాలు సృష్టించగలరని టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి అన్నారు.
తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల యూనియన్ (టీఎన్జీవోస్) ఆధ్వర్యంలో మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ, మహిళలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని ముందుకు సాగాలని సూచించారు.
మహిళలు ఏ రంగంలో ఉన్నా తమ బాధ్యతలను మరువకుండా అందుబాటులో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఎదగాలని ఆమె అన్నారు.
మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడం, క్యాంటీన్ల నిర్వహణ, యూనిఫామ్ లు కుట్టే బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించడం వంటి పలు చర్యలను ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. వచ్చిన అన్ని అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా, సామాజికంగా మరింత ఎదగాలని సూచించారు.
అదనపు కలెక్టర్ మాధురి మాట్లాడుతూ, మహిళలు సహనం, పట్టుదలకు ప్రతిరూపాలని అన్నారు. ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో ధైర్యంగా ముందుకు సాగుతూ తమ ప్రతిభను చాటుకుంటున్నారని తెలిపారు. కుటుంబ బాధ్యతలతో పాటు ఉద్యోగ విధులను సమన్వయం చేసుకుంటూ ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మహిళా ఉద్యోగులకు సూచించారు.
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగుల కోసం నిర్వహించిన వివిధ క్రీడా పోటీలలో గెలుపొందిన వారికి ఈ సందర్భంగా బహుమతులు ప్రదానం చేశారు. మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి విజయలక్ష్మి, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు జావిద్ అలీ, కార్యదర్శి రవి, కోశాధికారి శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, శ్రీకాంత్, రాష్ట్ర మహిళా కార్యదర్శి నిర్మలా రాజకుమారి, హెచ్‌డబ్ల్యుఓ రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్, పంచాయితీ కార్యదర్శుల రాష్ట్ర అధ్యక్షులు బలరాం, సుధామణి, లక్ష్మి, సుధారాణి, వెంకటేశం, యాదవ్ రెడ్డి, షరీఫ్, జగన్, వివిధ శాఖల మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.