Take a fresh look at your lifestyle.

ఐజి కాలనీవాసుల సమస్యలను పరిష్కారించాలని మంత్రి కి వినతి

 

ముద్ర,కాప్రా

చర్లపల్లి ఐజీ కాలనీ వాసుల సమస్యల పరిష్కారించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి , వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి కు
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వినతి పత్రం అందజేశారు.
చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఐజీ కాలనీ ప్రజలు ఎన్నాళ్లుగానో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ముందు అడుగు వేస్తున్నారు.
2009 సంవత్సరంలో జేఎన్న్యూఆర్ఎం పథకం కింద సుమారు 1200 ఇళ్లను నిర్మించగా, అప్పట్లో ఏర్పాటు చేసిన డ్రైనేజీ వ్యవస్థ ప్రస్తుతం పూర్తిగా దెబ్బతిన్నదని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు.దీంతో డ్రైనేజీ నీరు రోడ్లపైకి పొంగిపొర్లుతూ ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నదని తెలిపారు.
అలాగే, 2009లో నిర్మించిన ఇళ్లలో చాలావాటిలో స్లాబ్‌లు శిథిలావస్థకు చేరుకుని కూలిపోయే ప్రమాదం నెలకొన్నదని, వాటి మరమ్మతుల కోసం కాలనీ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారని వారి దృష్టికి తీసుకెళ్లారు.
ఐజీ కాలనీ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, పరిస్థితిని వెంటనే పరిశీలించి డ్రైనేజీ వ్యవస్థ పునరుద్ధరణతో పాటు ఇళ్ల మరమ్మతులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని, సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
కోరారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నెమూరి మహేష్ గౌడ్, కాలనీ అధ్యక్షుడు పర్షురాము యాదవ్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, సాగర్ గౌడ్ , వెంకటేష్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.