Take a fresh look at your lifestyle.

ఇంటింటికీ వెళ్లి బొట్టుపెట్టి… కరపత్రాలు పంచి…

 

హిందూ ఏక్తా యాత్రకు ఆహ్వానిస్తున్న కాషాయ శ్రేణులు
ఎల్లుండి జరగబోయే హిందూ ఏక్తా యాత్రకు చకచకా ఏర్పాట్లు
గతం కంటే ఘనంగా జోష్ నింపుందుకు సిద్ధమైన కేంద్ర మంత్రి బండి సంజయ్
వినూత్న రీతిలో కళారూపాలు, సాంస్క్రుతిక ప్రదర్శనలతో ఆకట్టుకోనున్న ఏక్తా యాత్ర
*ఒక్కడితో మొదలై….హిందువులంతా సంఘటితమై…. *
16 ఏళ్లుగా అప్రతిహతంగా కొనసాగుతున్న హిందూ ఏక్తా యాత్ర
వివిధ కళారూపాలు, సాంస్క్రుతిక ప్రదర్శనలతో ఏటా ఆకట్టుకుంటున్న హిందూ ఏక్తా యాత్ర
కరీంనగర్ పార్లమెంట్ తోపాటు రాష్ట్రం నలుమూలల నుండి యాత్రకు తరలివచ్చేందుకు సిద్ధమైన హిందుత్వ వాదులు

ముద్ర, కరీంనగర్ :

హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఈనెల 12న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘హిందూ ఏక్తా యాత్ర’కు ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. హిందువులందరినీ సంఘటితం చేయడమే లక్ష్యంగా ప్రతి ఏటా బాల గంగాధర్ తిలక్ గణేశ్ ఉత్సవాలను ప్రారంభించిన సంగతి తెలిసిదే. అదే స్పూర్తితో హిందువులందరినీ రాజకీయాలకు అతీతంగా సంఘటితం చేయాలనే లక్ష్యంతో సరిగ్గా 16 ఏళ్ల క్రితం బండి సంజయ్ కుమార్ గుప్పెడు మందితో కరీంనగర్ లో ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ను ప్రారంభించారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా గుప్పెడు మంది నుండి వందలుగా, వేలుగా హిందువులంతా తరలివచ్చి హిందూ ఏక్తా యాత్రలో పాల్గొంటున్నారు. ప్రతి ఏటా హిందూ ఏక్తా యాత్రకు వచ్చే హిందువుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత ఏడాది సైతం భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. ఈసారి అంతకు మించి ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు.

గతంకంటే మిన్నగా…
గతానికి భిన్నంగా ఈసారి ‘హిందూ ఏక్తా యాత్ర’కు రావాలంటూ కాషాయ శ్రేణులు, కార్పొరేటర్లు ఇంటింటికీ వెళ్లి బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్నారు. కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. కాషాయ శ్రేణులు తమ తమ డివిజన్లలోని, కాలనీల్లోని గోడలపై ‘హిందూ ఏక్తా యాత్ర’కు తరలి రావాలంటూ స్వయంగా వాల్ పెయింటింగ్ రాశారు. సోషల్ మీడియా ద్వారా విస్త్రత ప్రచారం నిర్వహిస్తున్నారు.

వేసవిలో ఇబ్బంది లేకుండా….
బండి సంజయ్ ఆధ్వర్యంలో ఈనెల 12న సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ లోని వైశ్యా భవన్ నుండి ప్రారంభమయ్యే ఏక్తా యాత్ర

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు జనం ఉత్సాహం చూపుతుండటంతో వారికి ప్రత్యేకంగా రవాణా సదుపాయం కల్పించేందుకు కాషాయ శ్రేణులు సిద్ధమయ్యాయి. మరోవైపు ఎండాకాలం కావడంతో ఏక్తా యాత్రలో పాల్గొనే వారికి కాషాయ శ్రేణులు, హిందుత్వ వాదులు, వ్యాపారులు స్వచ్ఛందంగా మంచినీళ్లు, మజ్జిగ, ఇతర ఆహార పానియాలను అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

హిందూ ఏక్తా యాత్ర ఆరంభమయ్యేది ఇలా…
కరీంనగర్ లోని వైశ్య భవన్ నుండి 12న సాయంత్రం 4 గంటలకు హిందూ ఏక్తా యాత్ర ర్యాలీ ప్రారంభం కానుంది. ర్యాలీ ఆరంభంలోనే వైశ్యాభవన్ వద్ద హిందుత్వ వాదులను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగిస్తారు. అనంతరం వైశ్యా భవన్ నుండి ప్రారంభమయ్యే ర్యాలీ రాజీవ్ చౌక్, టవర్ సర్కిల్, గంజ్, కమాన్ , వన్ టౌన్, వెంకటేశ్వర టెంపుల్, అమరవీరుల స్థూపం, జయశంకర్ సర్కిల్, రాజీవ్ చౌక్ మీదుగా తిరిగి వైశ్య భవన్ కు చేరుకుంటుంది. ఇక్కడే హిందూ ఏక్తా యాత్రను ముగిస్తారు. ఈ యాత్రకు కులాలను పక్కన పెట్టి హిందువులంతా రావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇచ్చిన పిలుపు మేరకు రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల కార్యకర్తలంతా ఈ యాత్రకు హాజరవుతుండటం విశేషం. ముఖ్యంగా వివిధ కుల సంఘాల నాయకులంతా సంఘీభావం తెలిపారు. వీరితోపాటు వివిధ వ్రుత్తి సంఘాలు, ధార్మిక సంస్థలు, కళాకారులు, కార్మిక సంఘాల నాయకులు ఈ యాత్రలో పాల్గొనబోతోన్నాయి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ

ఆకట్టుకోనున్న కళారూపాలు, సాంస్క్రుతిక ప్రదర్శనలు
దాదాపు 6 గంటలపాటు కొనసాగే హిందూ ఏక్తా యాత్రలో పాల్గొనే హిందుత్వ వాదులు, కరీంనగర్ పట్టణ ప్రజలను ఆకట్టుకునేలా వివిధ రూపాల్లో కళా ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఇప్పటికే కేరళ నుండి హనుమంతుడు, హైదరాబాద్ నుండి శ్రీరాముడి విగ్రహాలను కరీంనగర్ కు తరలిస్తున్నారు. ఢిల్లీ నుండి ప్రత్యేక వేషధారణలతో ఆకట్టుకునే కళాకారులను రప్పిస్తున్నారు. కేరళ నుండి డప్పు వాయిద్య కళాకారులు వస్తున్నారు. ప్రత్యేకంగా సిరిసిల్ల నుండి ప్రతి ఏటా ధ్వజాలు రాబోతున్నాయి.

జోష్ నింపేందుకు సిద్ధమైన కేంద్ర మంత్రి

*గత కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలతో ప్రజల్లో అయోమయం నెలకొన్న నేపథ్యంలో ‘‘హిందూ ఏక్తా యాత్ర’’ సందర్భంగా వాటన్నింటినీ పటా పంచలు చేస్తూ హిందుత్వ వాదుల్లో జోష్ నింపేందుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సిద్ధమయ్యారు. ముఖ్యతో తనతోపాటు రాష్ట్రంలోని అనేక మంది హిందుత్వ వాదులపైనా, కుటుంబ సభ్యులపైనా లౌకిక వాద ముసుగులో కొనసాగుతున్న దాడులను ఎండగడుతూ హిందుత్వ వాదులందిరినీ ఏకతాటిపైకి తీసుకురావడమే లక్షంగా హిందూ ఏక్తా యాత్రను కొనసాగించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.