Take a fresh look at your lifestyle.

పొరపాట్లను సరిదిద్దుకొని పార్టీని బలోపేతం చేయాలి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.జగదీశ్వర్ గౌడ్

 

ముద్ర, శేరిలింగంపల్లి :

రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహ రెడ్డి మరియు ఇంచార్జ్ ఎంపి మల్లు రవి ఆదేశాల మేరకు పీసీసీ ప్రధాన కార్యదర్శి వి. జగదీశ్వర్ గౌడ్ నియోజకవర్గ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్ని నాయకులకు దిశానిర్దేశం చేశారు..
ఈరోజు శేరిలింగంపల్లి నియోజకవర్గం నల్లగండ్ల గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి సమావేశం లో బూత్ స్థాయి నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గత పది సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదురుకొని పార్టీ అధికారంలోకి రావడానికి చేసిన కృషి మర్చిపోలేమని గుర్తుచేశారు.
2023 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎంఎల్ఏ అభ్యర్థిగా అవకాశం కల్పించిన కాంగ్రెస్ అధిష్టానం, సమయం తక్కువ ఉన్నప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తల కృషి వల్ల లక్ష పది వేల ఓట్లకు పైగా సాధించగలిగారు అన్నారు.
బూత్ స్థాయిలో గత ఎన్నికలలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని కాంగ్రెస్ పార్టీ ని కింది స్థాయి నుండి బలపర్చుకోవాలని, నాయకులు – కార్యకర్తల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.
ఏ పార్టీ లో అయినా కార్యకర్త చాలా ముఖ్య భూమిక పోషిస్తారని, కింది స్థాయిలో ప్రజల అవసరాలను, వారి సంక్షేమానికి కావలసిన మౌలిక వసతులపై అవగాహన కార్యకర్తలకు ఎక్కువగా ఉంటుందని చెప్పారు.2028 సార్వత్రిక ఎన్నికలలో నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు..
కింది స్థాయి నుండి కష్టం చేసుకుంటూ, నా కష్టాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ నన్ను పిలిచి టికెట్ ఇచ్చింది అని గుర్తుచేసారు. రానున్న స్థానిక ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మనం క్షేత్ర స్థాయిలో సిద్ధంగా ఉండాలన్నారు. బూత్ లెవెల్ ఏజెంట్ కచ్చితంగా బూత్ లో ఓటుకలిగి ఉన్నవారై ఉండాలి, ⁠బూత్ లో పది మంది కచ్చితంగా ఉండాలి, ⁠ఒక బూత్లో ఒక కుటుంబం నుండి ఒక వ్యక్తికి మాత్రమే అవకాశం వ్వాలని,
బూత్ పరిధిలోని 1000-1200 ఓటర్ల ఇంటికి వెళ్లి మరి కాంగ్రెస్ పార్టీ చేసే సంక్షేమ పథకాల గురించి చెప్పి ఓట్లను అభ్యర్థించాలని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.