Take a fresh look at your lifestyle.

పేదప్రజలకు న్యాయం చేయాలని ఎమ్మెల్యేకి వినతి

 ముద్ర, ప్రతినిధి భువనగిరి :
మండలంలోని వడాయిగూడెం గ్రామంలో సర్వే నంబర్ 518 లో 70,80 సంవత్సరాలుగా నిర్మించుకున్న నివాస గృహాలను నిషేధిత జాబితా (22A)నుండి తొలగించి పేదప్రజలకు న్యాయం చేయాలని గ్రామ సర్పంచ్ నీల శిరీష ఓంప్రకాష్ గౌడ్ భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి కి వినతి పత్రం పట్టణ క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చుక్కల శంకర్ యాదవ్, వార్డు సభ్యులు బబ్బూరి సబిత శంకర్ గౌడ్, పబ్బాల ఉమా రమేష్, చుక్కల దుర్గయ్య యాదవ్, కోట జాంగిర్ దీప, కోట సుధాకర్, కోట సుధావాణి మల్లికార్జున్, బబ్బూరి భరత్ గౌడ్, మరియు రాసాల రాజుయాదవ్, కోట పోశయ్య, సుక్కల శ్రీశైలం, కోట నరసింహ, నీల భరత్ గౌడ్, నీల భారతమ్మ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.