ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలి. -డీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారూపాక అనిల్ కుమార్
ముద్ర,మోత్కూర్:
దేశంలో ఉపాధి అవకాశాల స్వరూపం మారుతున్న సమయంలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అమలు అత్యవసరమని డీహెచ్‌పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారూపాక అనిల్ కుమార్ స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగం క్రమంగా క్షీణిస్తుండగా, ప్రైవేట్ రంగం విస్తరిస్తున్న పరిస్థితుల్లో దళితులు, వెనుకబడిన వర్గాలకు తగిన అవకాశాలు దక్కకపోవడం సామాజిక న్యాయానికి విరుద్ధమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

దళిత హక్కుల పోరాట సమితి (డి హెచ్ పి ఎస్) భువనగిరి జిల్లా 2 వ జిల్లా మహా సభలు కాస పాక దయాకర్ అధ్యక్షతన మోత్కూర్ కె ఆర్ భవన్ లో నిర్వహించారు. ఈ సమావేశంన కు ముఖ్యఅతిథి గా దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ హాజరై మాట్లాడాతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమానత్వం, సమాన అవకాశాలు కల్పించాలని స్పష్టంగా చెబుతున్నప్పటికీ, ప్రైవేట్ రంగంలో ఈ సూత్రాలు అమలుకావడం లేదని ఆయన విమర్శించారు. సామాజికంగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు.ప్రైవేట్ రంగం దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. కానీ అక్కడ రిజర్వేషన్లు లేకపోవడం వల్ల దళిత యువత ఉపాధి అవకాశాల నుండి దూరమవుతున్నారు. ఇది కేవలం ఉపాధి సమస్య కాదు సమానత్వం, గౌరవం, హక్కుల సమస్య అని స్పష్టం చేశారు. ప్రైవేట్ కంపెనీల్లో నియామకాల్లో పారదర్శకత ఉండేల చట్టపరమైన మార్పులు తీసుకురావాలని, ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందే కంపెనీలకు రిజర్వేషన్ విధానం తప్పనిసరి చేయాలని ఆయన సూచించారు. అలాగే ప్రైవేట్ రంగంలో కుల వివక్షను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, అమలును పర్యవేక్షించేందుకు స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.డీహెచ్‌పీఎస్ తరఫున ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అమలుకు చట్టం తీసుకురావాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను చేపడతామని హెచ్చరించారు. డి హెచ్ పి ఎస్ రాష్ట్ర రెండవ మహా సభలు ఏప్రిల్ 17 18 వరంగల్ జిల్లా లో జరుగనుంది. ఈ మహా సభల కు 33 జిల్లా నుండి 500 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. అని ఆయన చెప్పారు. ఈ సమావేశానికి సీపీఐ జిల్లా యనాల దామోదర్ రెడ్డి, సహాయ కార్యదర్శిలు బొలగని సత్యనారయణ,చేడే చంద్రయ్య, మండల కార్యదర్శి అన్నెపు వెంకట్, డి హెచ్ పి ఎస్ జిల్లా కార్యదర్శి సలిగంజి వీరస్వామి, నాయకులు ఎఐవై ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి శాంతికుమార్, ఇంజ హేమలత,కిష్టమ్మా ,జిట్టా రాములు,న్యాతకాని కిష్టమ్మా, భాగ్యమ్మ,కట్ల యాదగిరి, చెడే సుందర్, బాల నర్సింహా,తదితరులు పాల్గొన్నారు.