Take a fresh look at your lifestyle.

ఎస్సి ఎస్టీల శ్రేయస్సు కోసమే పౌరహక్కుల కార్యక్రమం- దాసరి తిరుమలేష్

ముద్ర, మోత్కూర్:
మోత్కూర్ మండలంలోని ముషిపట్ల గ్రామంలో ఆర్ఐ కాసోజు రవి ఆధ్వర్యంలో నిర్వహించిన పౌరహక్కుల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జిల్లా ఎస్సి ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దాసరి తిరుమలేష్ పాల్గొని మాట్లాడుతూ కుల మత జాతి లింగ బేధాలు అని లేకుండా గ్రామంలోని ప్రతి ఒక్కరు కలసి ఉండాలని గ్రామంలో కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వ పరంగా అందాల్సిన డబ్బులు ఆలస్యం కాకుండా వెంటనే వారికి చెక్కులు అందచేయ్యాలని ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసులల్లో బాధితులకు ఇవ్వాల్సిన పరిహారలు ప్రభుత్వం వెంటనే అందచేయ్యాలని కోరారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వలు ఎస్సి ఎస్టీలకు సంబందించి అమలు చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమంపై అందరూ అవగాహనా చేసుకొని ముందుకు సాగాలని కోరుతూ ప్రతి ఒక్క అధికారి ఎస్సి ఎస్టీలు తమ న్యాయమైన పనులపై తమ దగ్గరకు వస్తే ఆలస్యం చెయ్యకుండా వెంటనే చెయ్యాలని, ముక్యంగా ఎస్సి ఎస్టీ కేసులల్లో ఎస్సి ఎస్టీలు రాజీలు కుదుర్చుకోవద్దు అని న్యాయపరంగానే పోరాడాలని ఎస్సి ఎస్టీలు కూడా తప్పుడు కేసులు నమోదు చెయ్యొద్దని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఇటీవలే ఆర్ఐ గా బాధ్యతలు తీసుకొని తొలిసారి ఇట్టి కార్యక్రమం నిర్వహించిన కాసోజు రవి కి శుభాకాంక్షలు తెలియచేసి శాలువాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పైళ్ల నర్సిరెడ్డి , ఎస్ఐ సతీష్, ఏపీఓ జనార్దన్ రెడ్డి, అసిస్టెంట్ ఆర్ ఐరవీంద్ర చారి, ఏపీఎం పకీరయ్య, పంచాయతీ సెంక్రెటరీ యాదగిరి, జిపిఓ ప్రవీణ్, సీసీ భాస్కర్, హెచ్ డబ్ల్యు ఓ అశోక్, (హెచ్ఎ) ఎఫ్ మంజుల, ఏ డబ్ల్యు టి భార్గవి, ఏఎస్ఐ శ్రీనువాస్, ఉప సర్పంచ్ నోముల అంజయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ మత్స్యగిరి, విబికే దేవేంద్ర, వార్డ్ సభ్యులు కొల్లు సునీత ఎలిమినేటి నవీన్ రెడ్డి బుశిపాక శ్రీకాంత్, చెనగోని పావని, బుశిపాక పద్మ, నేర్లకంటి మత్స్యగిరి, బుశిపాక రమేష్, బుశిపాక నరేష్, యాదగిరి, అంజి, అశోక్, నరేష్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.