– బీ ఆర్ ఎస్ లో చేరేందుకు కాంగ్రెస్ కార్పొరేటర్లు సిద్ధంగా ఉన్నారు
– ఊకొడితే పార్టీ లో చేరేందుకు ఇప్పుడే పరుగులు పెడతారు
– కాంగ్రెస్ కార్పొరేటర్లు మాకొద్దు…ఆ సంస్కృతి మేము వ్యతిరేకం
– బీ ఆర్ ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరాలని పోలీసుల ద్వారా ఒత్తిడి
– కాంగ్రెస్ లో చేరితే డివిజన్ లకు నిధులు ఇస్తాం
– బ్రోకర్లుగా వ్యవహరిస్తున్న కొందరు పోలీసులు
– మీడియా సమావేశం లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
………………………………………
ముద్ర, ఉమ్మడి
మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి :
………………………………………
గులాబీ పార్టీ కార్పొరేటర్ల ను ప్రలోభ పెట్టి కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పోలీసులను బ్రోకర్లుగా వాడుకుంటున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.సోమవారం తన క్యాంపు కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో ఆయన మాట్లాడారు. బీ ఆర్ ఎస్ పార్టీ తరఫున గెలిచిన కార్పొరేటర్ల కు పదవుల ఆశ చూపి ప్రలోభ పెడుతున్నారని, బీ ఆర్ ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరితే ముడా చైర్మన్, మార్కెట్ యార్డు చైర్మన్ పదవి తో పాటు ముఖ్య పదవులు ఇస్తామని ఇప్పటికే కొందరికి ఫోన్లు చేశారని, వాళ్లు స్పందించకుంటే పోలీసుల ద్వారా ఒత్తిడి పెంచుతున్నారని మండిపడ్డారు. మేము ఊ కొడితే బీ ఆర్ ఎస్ లో చేరేందుకు కాంగ్రెస్ కార్పొరేటర్లు ఊ కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ కార్పొరేటర్లను చేర్చుకునే ఉదేశ్యం అస్సలు లేదని, వారిని ప్రజలు ఎన్నుకున్నారని, వారి డివిజన్ అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కానీ మా కార్పొరేటర్ల పై జులుం చేసి, బయపెట్టి వినకపోతే పదవుల ఆశ చూపించి కాంగ్రెస్ లో చేరేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నరన్నారు. ఎమ్మెల్యే విద్యావంతుడని అనుకున్న కానీ ఇలాంటి చిల్లర రాజకీయం చేస్తారని అనుకోలేదన్నారు. ఎమ్మెల్యే కు అనుకూలంగా ఉంటే మైనింగ్, ఇసుక దందా లో రూ. లక్ష లు గడించాలని పోలీసులు బ్రోకర్లు గారు మారుతున్నారని, కొందరు పోలీసులు మా కార్పొరేటర్ల కు ఫోన్లు చేసి కాంగ్రెస్ లో చేరాలని, లేకుంటే కేసు లు నమోదు చేసి జైల్లో పెడతామని బెదిరిస్తున్నారని, అలాంటి పోలీసుల వ్యవహారం బయటపెడతామని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే కూడా నియోజకవర్గం అభివృద్ధి కి పాటుపడాలని,బీ ఆర్ ఎస్ చేసిన అభివృద్ధి నే ఆయన చూపించుకుంటున్నారని విమర్శించారు.పేదల కోసం సూపర్ స్పెషలిటీ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయకుండా నాన్చు తున్నారని, ఇంకా బీ ఆర్ ఎస్ హయాంలో చేపట్టిన చాలా పనులు పెండింగ్ లో ఉన్నాయని, ఎమ్మెల్యే వీటి పై దృష్టి పెట్టాలని హితవు పలికారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ని కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ చేసిన ఘనత తనదే అన్నారు. రెండున్నర ఏళ్ళ లో ఇక్కడ కాంగ్రెస్ చేసిన అభివృద్ధి శూన్యమన్నారు.కార్పొరేషన్ ఎన్నికలు పూర్తయి రెండు నెలలు కాకముందే మా పార్టీ కార్పొరేటర్ల ను లాగే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. కార్పొరేషన్ అభివృద్ధికి సహకరించాలని మేమంతా మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఏకగ్రీవంగా కావడానికి సహకరించినమని, ఎమ్మెల్యే ధన్యవాదాలు చెప్పి…అందరూ అభివృధి కి సహకరించాలని ప్రకటించి..మరి ఇప్పుడు మా కార్పొరేటర్ లను గుంజుకునే ప్రయత్నం చేయడం ఎంతవరకు సబమని అన్నారు.
మీ పార్టీ లోనే చాలా మంది అసంతృప్తి తో ఉన్నారు… ముందుగా మీ పార్టీని చక్కదిద్దుకోండన్నారు.
ముందు అభివృధి పై దృష్టి పెట్టండి…ప్రత్యేక నిధులు తీసుకురండి. .అవన్నీ వదిలేసి మా నాయకులను పార్టీలోకి తీసుకోవాలని చూస్తే సహించమని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.పోలీసులకు సమాజం లో గౌరవం ఉంది… ఎమ్మెల్యే చెప్పినట్లు వింటే ఇంకో రెండేళ్లు ఉండొచ్చు అనుకుంటే పొరపాటు..మీకు అంత కాంగ్రెస్ కు మద్దతు గా ఉంటే మీరే కండువాలు కప్పుకొండని పోలీసుల తీరును ఎండగట్టారు.
డివిజన్ల అభివృద్ధి కి డబ్బులవంటున్నారు కానీ రూ.30 లక్షలు పెట్టి ఛాంబర్ల కోసం ఖర్చు చేయడం చూస్తే ప్రజల అభివృద్ధి కోసం పనిచేయడం లేదని, ప్రజల డబ్బుతో లగ్జరి చేసేందుకు మున్సిపాలిటీ ని వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. పట్టణం లో నిరంతరం తాగు నీరు అందించేందుకు చర్య లు తీసుకోవాలన్నారు.
కార్పొరేటర్ల ను బెదిరిస్తే బేదరమని,పద్ధతి మార్చుకోకపోతే సహించేది లేదని శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు.
మాజీ మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, పార్టీ పట్టణ అధ్యక్షులు శివరాజ్, కార్పొరేటర్లు నవకాంత్, శరత్ రెడ్డి, రమేష్ నాయక్, కిషోర్ కుమార్, మధు మోహన్, సత్యం సీనియర్ నాయకులు కుర్వ శ్రీశైలం,శ్రీను నాయక్, సిద్ధిక్, జహంగీర్, ఖలీం, క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.