కాంగ్రెస్ పార్టీకి వెన్నుముకగా, జగిత్యాల నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా పేరున్న సీనియర్ రాజకీయ నేత టీ.జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు. సోమవారం జగిత్యాలలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) స్వయంగా జీవన్ రెడ్డికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. జీవన్ రెడ్డి వంటి నేత రావడంతో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్‌కు భారీ బలం చేకూరినట్లయింది.
ఒకవైపు మేడిగడ్డ వద్ద సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తుండగా, అదే సమయంలో కేసీఆర్ జగిత్యాలలో భారీ చేరికతో కౌంటర్ ఇవ్వడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తెలంగాణ హితం కోసమే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.