Take a fresh look at your lifestyle.

టూరిజం మాస్టర్ ప్లాన్ రూపకల్పనకై ప్రణాళికలు సిద్ధం చేయాలి : అడిషనల్ కలెక్టర్ ఏ. భాస్కరరావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
టూరిజం మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ ఏ. భాస్కరరావు సంబంధిత అధికారులను ఆదేశించారు.
టూరిజం మాస్టర్ ప్లాన్ తయారీలో భాగంగా మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధానంగా రాచకొండ , భువనగిరి ఫోర్ట్, మహదేవ్ పూర్, యాదాద్రి టెంపుల్, కొలనుపాక, మత్స్యగిరి గుట్ట, ముఖ్యమైన ప్రదేశాలను గుర్తించి ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రణాళిక లు ఓయంట్స్ సొల్యూషన్ వారు రూపొందిస్తారని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా టూరిజం అధికారి కే. ధనంజనేయులు, అసిస్టెంట్ డైరెక్టర్ ఓంప్రకాష్, ఓయంట్స్ నుండి శ్రీయానిష్ కుమార్, రఘూవేంద్ర, వివేరా వెంకట్ రెడ్డి, అంజయ్య, జిల్లా అటవీ శాఖ అధికారి, దేవస్థాన అధికారి, డిప్యూటీ కలెక్టర్ టూరిజం రామ మూర్తి , పోచంపల్లి యాదగిరిగుట్ట భువనగిరి మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
కే. ధనంజనేయులు జిల్లా యువజన మరియు క్రీడల మరియు టూరిజం అధికారి, యాదాద్రి భువనగిరి జిల్లా.

Leave A Reply

Your email address will not be published.