ముద్ర, శేరిలింగంపల్లి:
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదు బండలో గల కుడికుంట చెరువును స్వచ్ఛంద సంస్థ సాహే ప్రతినిథి కల్పనరమేష్ అధ్వర్యంలో ఇన్ఫోసిస్ ఐటీ సంస్థ సౌజన్యంతో చేపడుతున్న సుందరీకరణ మరియు అభివృద్ధి పనులను పీయేసీ ఛైర్మన్ అరికెపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్మన్ అరెకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని 64 చెరువులను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని, చెరువుల సుందరీకరణతో స్వచ్చమైన వర్షపు జల సిరులను ఒడిసిపడుదామని, చెరువులు జలకళతో గ్రామీణ వాతావరణం నెలకొల్పడమే నా ధ్యేయంగా పనిచేస్తానన్నారు. చెరువులను కాపాడితే అవి మనల్ని కాపాడుతాయని, తద్వార జీవ వైవిధ్యం పెరుగుతుంది, చెరువుల సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, చెరువులను దత్తత తీసుకొని అభివృద్ధి చేసే వారు కనబడే దేవుళ్ళతో సమానమని చైర్మన్ గాంధీ కొనియాడారు. చెరువు కట్ట పై వాకింగ్ ట్రాక్ కాలనీ వాసులకు, వృద్ధులకు, చిన్న పిల్లలకు ఎంతగానో ఉపయోగపడుతుందని, ఇక్కడి పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని, సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మారబోయిన రాజు యాదవ్, మల్లేష్ యాదవ్, రాములు, మల్లేష్, పవన్ మరియు కార్యకర్తలు, కాలనీ వాసులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.